Telecom tariff hike | మొబైల్ యూజ‌ర్ల‌కు టెలికాం సంస్థ‌ల షాక్‌..!

Telecom tariff hike | మొబైల్ యూజ‌ర్ల‌కు టెలికాం సంస్థ‌ల షాక్‌..!
  • భారీగా పెర‌గ‌నున్న టారిఫ్‌

విధాత‌: మొబైల్ యూజ‌ర్ల‌కు టెలికాం సంస్థ‌లు బిగ్‌ షాక్ ఇవ్వ‌నున్నాయి. 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌రువాత టారిఫ్ ధ‌ర‌లు భారీగా పెర‌గనున్నాయి. జూన్- అక్టోబ‌ర్ మ‌ధ్య టెలికాం సంస్థ‌లు 15 శాతం నుంచి 17 శాతం వ‌ర‌కు టారిఫ్ ధ‌ర‌లు పెంచే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ టారిఫ్ పెంచ‌డం వ‌ల‌న ఎయిర్‌టెల్ సంస్థ ఎక్కువ‌గా ల‌బ్ది పొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్థుతం ఎయిర్‌టెల్ సంస్థ‌కు వినియోగ దారుడి నుంచి రూ. 208 స‌గ‌టు రెవిన్యూ వ‌స్తుండ‌గా త‌రువాత అది కాస్తా రూ. 286 కి పెర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం.