World Cup 2023 Schedule | అక్టోబ‌ర్‌ 15న దాయాదుల స‌మ‌రం.. చూసేందుకు ప్ర‌పంచం సిద్ధం

విధాత‌: భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ (World Cup 2023 Schedule) ఖ‌రారైంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… అక్టోబ‌రు 8న ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డి భార‌త్ త‌న ప్ర‌పంచ‌క‌ప్ వేట‌ను చెన్నైలో ప్రారంభించ‌నుంది. అనంత‌రం అదే నెల 15న క్రికెట్ ప్ర‌పంచం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసే దాయాదుల స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే ఈ మ్యాచ్‌లో భార‌త్ పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ప్ర‌స్తుతం డ్రాఫ్ట్ ద‌శ‌లో ఉన్న ఈ టైం టేబుల్ను బీసీసీఐ (BCCI) ఐసీసీ […]

World Cup 2023 Schedule | అక్టోబ‌ర్‌ 15న దాయాదుల స‌మ‌రం.. చూసేందుకు ప్ర‌పంచం సిద్ధం

విధాత‌: భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ (World Cup 2023 Schedule) ఖ‌రారైంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం… అక్టోబ‌రు 8న ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డి భార‌త్ త‌న ప్ర‌పంచ‌క‌ప్ వేట‌ను చెన్నైలో ప్రారంభించ‌నుంది. అనంత‌రం అదే నెల 15న క్రికెట్ ప్ర‌పంచం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూసే దాయాదుల స‌మ‌రం జ‌ర‌గ‌నుంది.

అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగే ఈ మ్యాచ్‌లో భార‌త్ పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ప్ర‌స్తుతం డ్రాఫ్ట్ ద‌శ‌లో ఉన్న ఈ టైం టేబుల్ను బీసీసీఐ (BCCI) ఐసీసీ (ICC) కి పంపింది. స‌భ్య‌దేశాల సూచ‌న‌లు తీసుకుని ఫైన‌ల్ కాల ప‌ట్టిక‌ను ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.

ఈ ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌రంలో ఫైనల్ మ్యాచ్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన న‌రేంద్ర‌మోదీ (Narendra Modi) స్టేడియంలో జ‌ర‌గనుంది. సెమీ ఫైన‌ల్స్ న‌వంబ‌రు 15, 16 తేదీల్లో నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తుండ‌గాద‌… వేదిక‌లు ఖ‌రారు కావాల్సి ఉంది.

ఈ టోర్నీలో భార‌త్ త‌న లీగ్ మ్యాచ్‌ల‌ను కోల్‌క‌తా, ముంబ‌యి, దిల్లీ, బెంగ‌ళూరు మొద‌లైన 9 వేదిక‌ల్లో ఆడ‌నుండ‌గా.. పాక్ ఐదు న‌గ‌రాల్లో ఆడ‌నుంది. మొత్తం 10 టీంలు ప్ర‌పంచ‌క‌ప్ కోసం పోటీప‌డ‌నుండ‌గా.. ఇప్ప‌టికే 8 టీంలు ఖ‌రార‌య్యాయి. మ‌రో రెండింటిని క్వాలిఫ‌య‌ర్ల ద్వారా ఎంపిక చేయ‌నున్నారు.

భార‌త్ ఆడే మ్యాచ్‌ల వివ‌రాలు (మార్పులు ఉండొచ్చు)

  • ఇండియా – ఆస్ట్రేలియా – అక్టోబ‌ర్ 8 – చెన్నై
  • ఇండియా – ఆఫ్ఘ‌నిస్థాన్ 11 – దిల్లీ
  • ఇండియా – పాకిస్థాన్ 15 – అహ్మ‌దాబాద్‌
  • ఇండియా – బంగ్లాదేశ్ 19 – పుణె
  • ఇండియా – న్యూజిలాండ్ 22 – ధ‌ర్మ‌శాల‌
  • ఇండియా – ఇంగ్లండ్ 29 – ల‌క్నో
  • ఇండియా – క్వాలిఫ‌య‌ర్ జ‌ట్టు న‌వంబ‌ర్ 2 – ముంబ‌యి
  • ఇండియా – ద‌క్షిణాఫ్రికా 5 – కోల్‌క‌తా
  • ఇండియా – క్వాలిఫ‌య‌ర్ జ‌ట్టు 11 – బెంగ‌ళూరు