పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమైనట్టు అధికారులు శుక్రవారం తెలిపారు

విధాత: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది హతమైనట్టు అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లాలోని అరిహాల్ ప్రాంతంలోని న్యూ కాలనీలో గురువారం ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడి తోటలలో గాలింపు చర్యలు చేపట్టాయి.
భద్రతా బలగాల రాకను ముందే పసిగట్టిన మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యారు. ఉగ్రవాది వివరాలు, ఏ సంస్థకు చెందినవాడు అనేది తెలియాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.