టీచర్‌కు చిన్నారి ముద్దులు.. ఆ టీచర్ ఎమందంటే!
అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీచర్-విద్యార్థి మధ్య జరిగిన ఆ సంభాషణ చూడముచ్చటగా ఉండటంతో ఎంతోమంది ఆ వీడియోను ఆదరిస్తున్నారు. అయితే, ఎవరీ టీచర్ అంటూ వెతుకులాట మొదలవడంతో వారి అడ్రస్ తెలిసిపోయింది. ఈ ముద్దులొలికే ఘటన ఉత్తర్‌ప్రదేశ్ నైనీలోని సేత్ ఆనంద్‌రామ్ జైపురియా స్కూల్లో జరిగింది. ఆ టీచర్ పేరు విశాఖ త్రిపాఠి కాగా, ఆ చిన్నారి విద్యార్థి […]

అల్లరి చేస్తున్నావంటూ నొచ్చుకున్న టీచర్‌ను బుజ్జగిస్తూ.. ఓ చిన్నారి ఆమెకు క్షమాపణలు చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. టీచర్-విద్యార్థి మధ్య జరిగిన ఆ సంభాషణ చూడముచ్చటగా ఉండటంతో ఎంతోమంది ఆ వీడియోను ఆదరిస్తున్నారు. అయితే, ఎవరీ టీచర్ అంటూ వెతుకులాట మొదలవడంతో వారి అడ్రస్ తెలిసిపోయింది.
ఈ ముద్దులొలికే ఘటన ఉత్తర్‌ప్రదేశ్ నైనీలోని సేత్ ఆనంద్‌రామ్ జైపురియా స్కూల్లో జరిగింది. ఆ టీచర్ పేరు విశాఖ త్రిపాఠి కాగా, ఆ చిన్నారి విద్యార్థి పేరు అధర్వ్. తన వీడియోను ఎంతోమంది లైక్ చేస్తుండటంతో టీచర్ విశాఖ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు చేస్తున్న కార్యకలాపాలను వీడియో తీసి వారి తల్లిదండ్రులకు గానీ సోషల్ మీడియాలో గానీ పంచుకోవాలి. అయితే, అప్పుడు పిల్లలు చాలా అల్లరి చేశారని, అందులో అధర్వ్ కూడా ఉన్నాడని టీచర్ తెలిపారు.
అందుకే తన ప్రవర్తనపై తాను నొచ్చుకున్నానని చెప్పడంతో.. అతడు ఆ విధంగా క్షమాపణలు చెప్పాడని పేర్కొన్నారు. ఆ వీడియోను సహోద్యోగి నిషా తీశారని, అది తనకెంతో నచ్చడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్‌గా మారిందన్నారు. ప్రజలు ఈ వీడియోను ఎంతో ఇష్టపడ్డారని, ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు