Balagam: బంధాల భావోద్వేగం ‘బలగం’ సినిమా.. చిత్రం బృందం సన్మానోత్సవంలో MP వెంకట్ రెడ్డి

విధాత: మానవ సంబంధాల భావోద్వేగాల ప్రదర్శనగా బలగం సినిమా నిర్మించారని సామాజిక సంబంధాలను బలోపేతం చేసే బలగం చిత్ర బృందం అభినందనీయులని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో బలగం చిత్రబృందం దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత, నటీనటులను ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిత్ర బృందాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన చిత్రం […]

Balagam: బంధాల భావోద్వేగం ‘బలగం’ సినిమా.. చిత్రం బృందం సన్మానోత్సవంలో MP వెంకట్ రెడ్డి

విధాత: మానవ సంబంధాల భావోద్వేగాల ప్రదర్శనగా బలగం సినిమా నిర్మించారని సామాజిక సంబంధాలను బలోపేతం చేసే బలగం చిత్ర బృందం అభినందనీయులని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

నల్గొండలో బలగం చిత్రబృందం దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత, నటీనటులను ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిత్ర బృందాన్ని సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈమధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన చిత్రం బలగం సినిమా అని ప్రశంసించారు. పల్లెటూరి సెంటిమెంట్ ను, కుటుంబ బంధాల గొప్పతనాన్ని ఎంతో భావోద్వేగంతో తెరకెక్కించిన చిత్ర బృందాన్ని సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించేలా పాట పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందచేశారు.

దిల్ రాజు దిల్లున్న మంచి మనిషి అని, ఆయన తీసిన ప్రతీ సినిమా చూస్తుంటానని, దిల్ రాజు తలుచుకుంటే.. భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరని, కానీ కొత్తవారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తున్నారన్నారు. ప్రజలను మేలుకొలిపేలా ఆయన సినిమాలుంటాయన్నారు. దిల్ రాజు కుమార్తె హన్షిత.. దిల్ రాజు ప్రొడక్షన్ పెట్టి ఆయనకంటే వంద అడుగులు ముందేకేశారన్నారు.

నేను తరచూ సినిమాలు చూస్తుంటానని నా మనసుకు దగ్గరైన చిత్రం బలగం సినిమా అన్నారు. దర్శకులు వేణు ఎంతో గొప్పగా తెరకెక్కించారని, బలగం సినిమాతో జనంలో మార్పు వస్తోందని, అన్నదమ్ములు కలుస్తున్నారని, తల్లిదండ్రులను దగ్గరకు తీసుకుంటున్నారన్నారు. బలగం సినిమా నేను ఇప్పటివరకు ఆరుసార్లు చూశానన్నారు.

మొగిలయ్య ఓ చరిత్ర సృష్టించారని, క్లైమాక్స్ పాటను నిలిచిపోయేలా చేశారని, అందరి హృదయాలను తాకేలా ఆ దంపతులు పాడారన్నారు. మొగిలయ్య డయాలసిస్ ఖర్చులన్నీ తాను భరిస్తానని, కిడ్నీ మార్పిడికి నా వంతు సాయం చేస్తాన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. అంతకుముందు బలగం సినిమా యూనిట్‌తో కలిసి వెంకటరెడ్డి నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ లో పాల్గొన్నారు.