Warangal: గుజరాత్ మారణ హోమం చరిత్ర మరిచిపోలేనిది: మంత్రి నిరంజన్‌రెడ్డి
గురువు అద్వానికి పంగనామాలు పెట్టిన వ్యక్తి ప్రధాని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గుజరాత్‌లో జరిగిన మారణహోమం చరిత్ర మరిచిపోలేనిదని, గురువులాంటి అద్వానీకి చేసిన మోసం.. ఆయన రాష్ట్రపతి కాకుండా చేసిన కుట్ర.. చరిత్ర ఇంకా మసకబారలేదంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మరిపెడలో హాకా చైర్మన్‌గా నియమించబడిన మచ్చ శ్రీనివాస్ కు జరిగిన ఆత్మీయ […]

- గురువు అద్వానికి పంగనామాలు పెట్టిన వ్యక్తి ప్రధాని
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గుజరాత్‌లో జరిగిన మారణహోమం చరిత్ర మరిచిపోలేనిదని, గురువులాంటి అద్వానీకి చేసిన మోసం.. ఆయన రాష్ట్రపతి కాకుండా చేసిన కుట్ర.. చరిత్ర ఇంకా మసకబారలేదంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మరిపెడలో హాకా చైర్మన్‌గా నియమించబడిన మచ్చ శ్రీనివాస్ కు జరిగిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
చదువుకున్న సర్టిఫికెట్లు అడిగితే జరిమానాలు వేయించే చరిత్ర ప్రజలెప్పుడూ మరిచిపోరని మంత్రి అన్నారు. మోదీ పాలనను ప్రశ్నిస్తే.. అదానీతో తెరచాటు పాలనను గట్టిగా నిలదీస్తే. పార్లమెంట్ నుంచే పంపించారంటూ రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హునిగా వేటు వేశారని అన్నారు.
డోర్నకల్ నియోజకవర్గం బుర్హానపురం సర్పంచ్, వ్యాపారవేత్త మచ్చా శ్రీనివాస్‌ను హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్(HACA) చైర్మన్‌గా ఇటీవల రాష్ట్రప్రభుత్వం నియమించింది. చైర్మన్ గా నియమించిన తర్వాత తొలిసారి మరిపెడకు వచ్చిన సందర్భంగా తానంచర్ల నుంచి మరిపెడ వరకు భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి నిరంజన్ రెడ్డి హాజరై ప్రసంగించారు.
చేసిన పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రధానమంత్రి రావడం ఏంపద్దతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని ప్రశ్నించండి.. కేంద్రాన్ని నిలదీయండంటూ మంత్రి పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులు అత్యంత లౌక్యంగా ఉంటారు.. మాట పోగొట్టుకోరు… నిజాయితీగా ఉంటారన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో మంచి గుర్తింపు ఉంది కనుకనే మచ్చాకు ఇంత మంచి పదవి వచ్చిందన్నారు. మద్దతుగా వచ్చిన జిల్లా ఆర్యవైశ్యులందరినీ అభినందిస్తున్నానని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: మంత్రి సత్యవతి
ఆర్యవైశ్య సమాజం మీపైన ఎంతో నమ్మకం పెట్టుకుంది…శ్రీనివాస్ వారి నమ్మకాన్ని మరింత నిలబెట్టాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కొందరికి డబ్బులు ఉంటాయి.. మరికొందరికి పేరు ఉంటుంది.. ఇప్పుడు శ్రీనివాస్‌కు రెండు ఉన్నాయి.. వారు మరింత కీర్తి సాధించాలని మంత్రి అన్నారు.
మానుకోటలో ఆర్యవైశ్య భవన్
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపుకోసం ఆర్యవైశ్యులంతా కృషి చేయాలని మహబూబాబాద్ యంపి మాలోత్ కవిత అన్నారు. తొంబైశాతం ఆర్యవైశ్యులు ఎప్పుడూ నాకే ఓటువేస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ లో మంచి స్థలం ఆర్యవైశ్యులకు ఎకరం ఇచ్చేలా తమ్ముడు శంకర్ నాయక్ చూడాలి.. నా సహకారం అందిస్తానని, భవనం శ్రీనివాస్ కట్టిస్తారన్నారు.
మహబూబాబాద్‌లో ఎకరం జాగ ఇప్పించే బాధ్యత మాది.. ఆర్యవైశ్యభవనం కట్టీంచే బాధ్యత శ్రీనివాస్ తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్ పర్సన్ బిందు, జిల్లాగ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు, డిఎస్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.