సుప్రీంలో రేవంత్‌కు చుక్కెదురు

విధాత, హైద్రాబాద్ : ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ కేసులో రేవంత్ వాదనను ధర్మాసనం విభేదిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
గతంలోనూ ఇదే వాదనతో రేవంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సైతం కొట్టివేయగా, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా రేవంత్ పిటిషన్‌ను తిరస్కరించింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిచ్చారని రేవంత్ రెడ్డిపై అభియోగాలున్నాయి.