సుప్రీంలో చంద్ర‌బాబు క్వాష్ పిటీష‌న్.. రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాల‌న్న సీజేఐ

సుప్రీంలో చంద్ర‌బాబు క్వాష్ పిటీష‌న్.. రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాల‌న్న సీజేఐ

విధాత‌, న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) క్వాష్ పిటీషన్‌ (Quash Petition)పై సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)లో ప్రస్తావించనున్నారు. సీజేఐ డివై చంద్రచూడ్ (CJI DY Chandrachud) ధర్మాసనం ముందు ప్రస్తావించిన చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూత్రా (Siddharth Luthra). రేపు (మంగ‌ళ‌వారం) మెన్షన్ చేయాలని సీజేఐ సూచించారు.

అయితే.. రేపు విచారణ తేదీని ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు తెలిపింది. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీం కోర్ట్‌కు సెలవుల నేపథ్యంలో మంగళవారం చంద్రబాబు క్వాష్ పెటేషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో క్వాష్ పిటీష‌న్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంలో పిటీష‌న్ వేశారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో శ‌నివారం స్పెష‌ల్ లీవ్ పిటీష‌న్‌ను అడ్వ‌కేట్ ప్ర‌మోద్ కుమార్ దాఖ‌లు చేశారు.

కాగా.. సీఐడి ద‌ర్యాప్తు తుది ద‌శ‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమ‌ని గ‌త శుక్ర‌వారం క్వాష్ పిటీషన్ హైకోర్టు కోట్టేసింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని న్యాయస్థానం పేర్కొంది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని, ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.