TRT Exam Online | విధాత: టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ‘టీఆర్‌టీ)ని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ ఆలోచిస్తున్నది. ఇటీవలె 5,089 సాధారణ ఉపాధ్యాయ పోస్టులు, 1,523 స్పెషల్ ఎడ్యుకేషణ్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిఖశాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 15న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన అనంతరం టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది.
ఇప్పటివరకు టీఆర్‌టీ ని పెన్ను, పేపర్ విధానం (ఆఫ్‌లైన్) లోనే నిర్వహిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఈసారి ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తున్నట్టు సమాచారం.