Gudem | గూడెం సత్య నారాయణ స్వామి ఆలయంలో చోరీ

సీసీ కెమెరా పగలగొట్టిన దుండగులు హుండీ పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. Gudem | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ ఘటన మరువకముందే మరో అన్నవరంగా పిలువబడే గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గత రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దుండ‌గులు ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దొంగలు చేతులకు గ్లౌస్ ధరించి […]

Gudem | గూడెం సత్య నారాయణ స్వామి ఆలయంలో చోరీ
  • సీసీ కెమెరా పగలగొట్టిన దుండగులు
  • హుండీ పగలగొట్టి బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు.

Gudem | విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ ఘటన మరువకముందే మరో అన్నవరంగా పిలువబడే గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గత రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

దుండ‌గులు ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దొంగలు చేతులకు గ్లౌస్ ధరించి ఇనుప రాడ్ల సాయంతో గర్భగుడి ఆలయం యొక్క గేట్లను ద్వంసం చేసి హుండీని ద్వంసం చేసి హుండీలోని నగదు తో పాటు దేవతామూర్తులకు అలంకరించిన నగలను కూడా అపహరించుకు పోయినట్లు తెలుస్తుంది. ఆలయ ఈవో సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఆలయాల ఆదాయం ప్రభుత్వం తీసుకోవటమే తప్ప దేవాలయాలకు భద్రత కల్పించడంలో విఫలమైందని భక్తులు ఆరోపిస్తున్నారు . తెలంగాణ రాష్ట్రంలో రెండో అన్నవరంగ ప్రసిద్ధిగాంచిన సత్యనారాయణ స్వామి ఆలయానికి భద్రత లేకపోవడం శోచనీయం అని పలువురు ఆరోపిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ఆలయాల ఆదాయంపై ఉన్న శ్రద్ధ పై ఆలయాలకు భద్రత కల్పించడంలో విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు దుకాణాలలో చోరీ.. 40 వేల రూపాయల నగదు అపహరణ

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ ఏరియాలో నిన్న రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు .
ఒకే లైన్ లో ఉండే ఆరు దుకాణాలలో చోరీకి పాల్పడ్డారు . షాపులను సిందరవందర చేయడంతో పాటు షాపులో ఉన్న 40 వేల రూపాయల నగదు అపహరించి వెళ్లిపోయారు. దొంగలు పారిపోతున్న క్రమంలో గాయపడ్డ ఒక దొంగను స్థానికులు అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించారు
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.