ఉచిత విద్యుత్ ఆపే ప్ర‌స‌క్తే లేదు: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్‌ను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాయితీ విద్యుత్ చార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే నూతన కేంద్ర విద్యుత్ విధానం పై స్పందించిన మంత్రి సూర్యాపేటలో మీడియా తో మాట్లాడారు. పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్ పై కేంద్రం కుట్రలు పన్నడం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందించడం […]

ఉచిత విద్యుత్ ఆపే ప్ర‌స‌క్తే లేదు: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్‌ను ఆపే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాయితీ విద్యుత్ చార్జీలను డిస్కంలకు ముందస్తుగా చెల్లించాలనే నూతన కేంద్ర విద్యుత్ విధానం పై స్పందించిన మంత్రి సూర్యాపేటలో మీడియా తో మాట్లాడారు.

పేద ప్రజలకు అందించే రాయితీ విద్యుత్ పై కేంద్రం కుట్రలు పన్నడం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కేంద్రానికి కంటగింపుగా మారిందన్నారు. కేసీఆర్ ఉన్నంతవరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తాం అన్న మంత్రి, సామాజిక, ఆర్ధిక సమతుల్యం లేని దేశంలో సబ్సిడీల అవసరం ఉందన్నారు.

విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం కోసమే కేంద్రం ఎత్తులు వేస్తుందని అన్నారు. అన్నం పెట్టే రైతుకు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడం కోసమే సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఉచితమని కేంద్రం భావిచడం అవివేకం అన్నారు.

ఒకరిద్దరు సంపన్నుల కోసం కోట్లాది మంది ప్రజలను దారిద్య్రం లోకి నెట్టే కేంద్ర ప్రభుత్వ తీరును దేశ వ్యాప్తంగా ప్రజలను ఏకం చేసి ఎండ గడతామని అన్నారు. కేంద్రం ఫ్యూడల్ ఆలోచనలతో పేదలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం చేసే దుర్మార్గమైన ఆలోచనకు తాము పూర్తి వ్యతిరేఖం అని మంత్రి మ‌రోమారు స్ప‌ష్టం చేశారు.