Fish Teeth | మ‌నిషి దంతాల‌ను పోలిన వింత చేప‌.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Fish Teeth | ఈ చేప‌ను చూస్తుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంది. ఎందుకంటే ఆ చేప దంతాలు మ‌నిషి దంతాల‌ను పోలి ఉన్నాయి. అచ్చం మ‌నిషి దంతాల‌ను పోలి ఉన్న ఆ చేప ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అమెరికాలోని ఓక్లాహోమా సిటీకి చెందిన చార్లి క్లింట‌న్ స్థానికంగా ఉన్న ఓ చెరువులో చేప‌లు ప‌ట్టేందుకు దిగాడు. అయితే అత‌న్ని ఓ చేప కొరికింది. దీంతో దాన్ని ప‌ట్టుకునేందుకు య‌త్నించ‌గా, దొరికిపోయింది. ఇక ఆ చేప దంతాల‌ను చూసి […]

Fish Teeth | మ‌నిషి దంతాల‌ను పోలిన వింత చేప‌.. చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Fish Teeth | ఈ చేప‌ను చూస్తుంటే ఆశ్చ‌ర్య‌మేస్తోంది. ఎందుకంటే ఆ చేప దంతాలు మ‌నిషి దంతాల‌ను పోలి ఉన్నాయి. అచ్చం మ‌నిషి దంతాల‌ను పోలి ఉన్న ఆ చేప ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అమెరికాలోని ఓక్లాహోమా సిటీకి చెందిన చార్లి క్లింట‌న్ స్థానికంగా ఉన్న ఓ చెరువులో చేప‌లు ప‌ట్టేందుకు దిగాడు. అయితే అత‌న్ని ఓ చేప కొరికింది. దీంతో దాన్ని ప‌ట్టుకునేందుకు య‌త్నించ‌గా, దొరికిపోయింది. ఇక ఆ చేప దంతాల‌ను చూసి ప‌రేషాన్ అయ్యాడు. మ‌నిషి దంతాల మాదిరిగానే ఆ చేప దంతాలు ఉండ‌డంతో క్లింట‌న్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ఆ చేపను ఓక్లాహోమా వైల్డ్ లైఫ్ క‌న్జ‌ర్వేష‌న్ డిపార్ట్‌మెంట్‌కు అప్ప‌గించాడు.

అయితే ఈ చేపలు పాకు జాతికి చెందిన‌వ‌ని అధికారులు తెలిపారు. ఈ చేప‌లు సాధార‌ణంగా ఒక మీట‌ర్ పొడ‌వు, 40 కిలోల బ‌రువు వ‌ర‌కు పెరుగుతాయ‌న్నారు. మ‌న‌షుల‌కు వీటితో ఎలాంటి ప్ర‌మాదం లేద‌న్నారు. ఈ పాకు జాతి చేప‌లు సౌత్ అమెరికాలో ఎక్కువ‌గా క‌నిపిస్తాయ‌న్నారు. ఇక ఇవి చిన్న చిన్న చేప‌ల‌ను, పండ్ల‌ను, మొక్క‌ల‌ను ఆహారంగా తీసుకుంటాయి.