కేసీఆర్‌ను కోరుకునేది ఇందుకే!
విధాత: తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి పైకి తేవడానికి.. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడానికి కారణమా సీమాంధ్ర నేతల వైఖరే. పాదయాత్ర పేరుతో షర్మిల సీఎం, మంత్రులపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షలు చేసిన ఆయన కొడుకు అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేసి షర్మిల తెలంగాణ సీఎం చేయడం కోసం విజయమ్మ బాగానే కష్ట పడుతున్నారు. రాజకీయంగా తన పిల్లలు బాగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అందుకు వాళ్ళ మూలాలు […]

విధాత: తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటి పైకి తేవడానికి.. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకోవడానికి కారణమా సీమాంధ్ర నేతల వైఖరే. పాదయాత్ర పేరుతో షర్మిల సీఎం, మంత్రులపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు. సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్షలు చేసిన ఆయన కొడుకు అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర చేసి షర్మిల తెలంగాణ సీఎం చేయడం కోసం విజయమ్మ బాగానే కష్ట పడుతున్నారు.
రాజకీయంగా తన పిల్లలు బాగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అందుకు వాళ్ళ మూలాలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో కాకుండా తెలంగాణ పై పడి దండయాత్రలు చేయడాన్ని ఏ తెలంగాణ పౌరుడు అంగీకరించరు. మీరు ఎంత ఎక్కువ చేస్తే అంతే బలంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ ను నిలబెట్టు కుంటారు అన్న విషయాన్ని విస్మరించరాదు.
ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంపై ఇక్కడి ప్రజల్లో, నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ను తమ బల ప్రదర్శనకు రాజకీయ ప్రయోగాల శాలగా ఉపయోగించు కుంటామని అంటే ఇక్కడి ప్రజలే ఊరుకునే ప్రసక్తే ఉండదు. ఇది నాటి ఉద్యమ సమయం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు రుజువు అయ్యింది.
ఏపీ ప్రయోజనాల కోసం పని చేసే… అక్కడి మూలాలు ఉన్న వాళ్ళు మేము కూడా ఇక్కడే పుట్టాము.. ఇక్కడే పెరిగాము..ఇక్కడే చదివాము అంటే ఇక్కడ హాయిగా ఉండొచ్చు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. కానీ రాజకీయంగా ఆధిపత్యము చెలాయిస్తం అంటే అది జరిగే పని కాదు.
ఎందుకంటే తెలంగాణ చైతన్య వంతమైన ప్రాంతం. ఇక్కడి ప్రజలు తమ ఆత్మ గౌరవం కోసం ఐదు దశాబ్దాలు పోరాటం చేశారు. అసాధ్యం అన్న రాష్ట్ర సాధన ను సుసాధ్యం చేశారు. కాబట్టి సీమాంధ్ర నేతల వెకిలి చేష్టలకు ఇక్కడ స్థానం లేదు. ఉండదు.