Tirumala | తిరుమల శ్రీవారికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

Tirumala | సెప్టెంబర్ 18 నుండి 26 వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు విధాత : అధికమాసం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం రావడం..స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది నిర్వహించే నిర్వహించే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. సాలకట్ల అంటే వార్షిక అని అర్థం. ఈ […]

  • By: krs    latest    Aug 01, 2023 12:55 AM IST
Tirumala | తిరుమల శ్రీవారికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

Tirumala |

  • సెప్టెంబర్ 18 నుండి 26 వరకు వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు

విధాత : అధికమాసం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం రావడం..స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.

ప్రతి ఏడాది నిర్వహించే నిర్వహించే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. సాలకట్ల అంటే వార్షిక అని అర్థం. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండవసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు.

సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఏటా జరిగినట్లే ఈ ఏడాది కూడా జరుగుతాయి. సెప్టెంబర్ 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి.

ఇక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుండి 23 వరకు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ, ధ్వజావరోహణాలు ఉండవు. సౌరమానం, చంద్రమానంలో రోజుల సంఖ్యలో తేడాలుంటాయి. ఇలా వచ్చే రోజుల వ్యత్యాసాలతో ప్రతి మూడేళ్ల తర్వాత లెక్కిస్తే మరో నెల అధికంగా వస్తుంది. దీనిని అధికమాసంగా పిలుస్తారు.

2020లో కూడా అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అప్పుడు కరోనా నేపథ్యంలో భక్తులను అనుమతించలేదు. ఈ ఏడాది తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి తిరుమాడ వీధుల్లో వాహనసేవలు ఘనంగా కొనసాగనున్నాయి.

బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకునేందుకు కోట్లాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ముఖ్యంగా గరుడాళ్వార్ పై స్వామివారు మాడవీధుల్లో విహరించే ఘట్టాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులతో తిరుమల వీధులు భక్తజన కెరటాలవుతాయి.