ఆ.. చిత్రాలు ఆద్భుతం! అవి చూసి బాధ పడేవాడిని: దర్శకేంద్రుడు

విధాత‌: తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులను అద్దిన ఘనత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకే దక్కుతుంది. అడవి రాముడు నుంచి కమర్షియల్ చిత్రాలను ఇలా కూడా తీయవచ్చని ఆయన తీసి మరి నిరూపించారు. దానినే ఇప్పటివరకు అటు ఇటుగా మార్చి మన దర్శకులందరూ వరుస హిట్ల‌ను కొడుతున్నారు. పాట‌ల‌ను అందంగా తీయడంలో, హీరోయిన్లను అంతకన్నా అందంగా చూయించడంలో రాఘవేంద్ర రావుది ట్రేడ్‌మార్క్‌, హీరోల క్రేజీని బట్టి ఎంటర్టైన్మెంట్లతో మాస్‌ని మిక్స్ చేసి సినిమాలు తీయడంలోనూ సిద్ధహస్తులనే పేరు ఉన్న […]

  • By: krs    latest    Jan 26, 2023 11:05 AM IST
ఆ.. చిత్రాలు ఆద్భుతం! అవి చూసి బాధ పడేవాడిని: దర్శకేంద్రుడు

విధాత‌: తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులను అద్దిన ఘనత దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకే దక్కుతుంది. అడవి రాముడు నుంచి కమర్షియల్ చిత్రాలను ఇలా కూడా తీయవచ్చని ఆయన తీసి మరి నిరూపించారు. దానినే ఇప్పటివరకు అటు ఇటుగా మార్చి మన దర్శకులందరూ వరుస హిట్ల‌ను కొడుతున్నారు.

పాట‌ల‌ను అందంగా తీయడంలో, హీరోయిన్లను అంతకన్నా అందంగా చూయించడంలో రాఘవేంద్ర రావుది ట్రేడ్‌మార్క్‌, హీరోల క్రేజీని బట్టి ఎంటర్టైన్మెంట్లతో మాస్‌ని మిక్స్ చేసి సినిమాలు తీయడంలోనూ సిద్ధహస్తులనే పేరు ఉన్న ఆయన తన కెరీర్‌లో 100 చిత్రాలను పూర్తి చేయడమే కాక అన్ని త‌ర‌హా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోలతో సినిమాలే గాక, లేడి ఓరియెంటెడ్ , భక్తిరస చిత్రాలు ఇలా సినీ రంగంలో టచ్ చేయని కథాంశం అంటూ ఏదీ లేదని చెప్పాలి.

తాజాగా ఇయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ నేను నా కెరీర్‌లో చేయలేకపోయిన కొన్ని చిత్రాలు ఉన్నాయని ముఖ్యంగా గాంధిజీ, బాగ్ మిల్కా బాగ్ బయోపిక్‌ చిత్రాలు చూస్తున్నప్పుడు ఇలాంటి చిత్రాలు నేను ఎందుకు చేయలేకపోయానని బాధ పడుతానని తెలిపారు. వీటిని చూస్తున్నప్పుడు వ్యక్తుల జీవితాన్ని ఎంత అద్భుతంగా తెర‌కెక్కించ‌వ‌చ్చో తెలిసిందని తెలిపారు.

మన గ్రామీణ ప్రాంతాల వాసులు ఆడే గూటి బిళ్ళ ఆటని చూసి బ్రిటిష్ వారు కనిపెట్టిన క్రికెట్‌ని మనవాళ్లు ఆడి వారిపై ఎలా గెలిచారో చూపించిన ల‌గాన్ కూడా తనకి అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నారు. మొత్తానికి తన కెరీర్‌లో బయోపిక్‌లు తీయలేకపోవడం రాఘవేంద్రరావుకి తీరని లోటుగా మిగిలిందని చెప్పవచ్చు.