El Nino | పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు.. ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షాపాతం..!
న్యూఢిల్లీ : ఈ సారి భారత్‌లో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపనున్నది. ఫలితంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురువనున్నాయి. దేశంలో రుతుపవనాలు సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు చురుగ్గా ఉంటాయి. అయితే, ఈసారి భారత్‌పై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ విభాగం నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) నివేదిక పేర్కొంది. 49శాతం ఎల్‌నినో పరిస్థితులు, 47శాతం సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని నివేదిక పేర్కొంది. భారతదేశంలో నినో రుతుపవన వర్షాలపై ఎల్‌నినో […]

న్యూఢిల్లీ : ఈ సారి భారత్‌లో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపనున్నది. ఫలితంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురువనున్నాయి. దేశంలో రుతుపవనాలు సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు వరకు చురుగ్గా ఉంటాయి. అయితే, ఈసారి భారత్‌పై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అమెరికా వాతావరణ విభాగం నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) నివేదిక పేర్కొంది. 49శాతం ఎల్‌నినో పరిస్థితులు, 47శాతం సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని నివేదిక పేర్కొంది.
భారతదేశంలో నినో రుతుపవన వర్షాలపై ఎల్‌నినో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఎన్‌ఓఏఏ స్పష్టం చేసింది. అమెరికా వాతావరణ సంస్థ అంచనావేయడం ఇది రెండోసారి. ఇంతకు ముందు జనవరిలో సైతం ఎల్‌నినో పరిస్థితులపై అంచనా వేసింది. జనవరి నివేదికలో జులై తర్వాత ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొంది. జూలై-ఆగస్టు-సెప్టెంబర్‌లో ఎల్‌నినో 57 శాతం వరకు యాక్టివ్‌గా ఉంటుందని అంచనా. రుతుపవనాల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఏప్రిల్-మేలో మాత్రమే తెలుస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలలు పేర్కొంటున్నారు.
భారత నిపుణులు ఏమన్నారంటే..!
రుతుపవనాలపై ఇప్పుడే ఏమైనా వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని భారత నిపుణులు పేర్కొన్నారు. జనవరి నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ అంచనా వేసిందని, రాబోయే నెలల్లో చాలా మార్పులు రావచ్చని చెప్పారు. అయితే, కొట్టాయంలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ స్టడీస్ డైరెక్టర్ డి శివానంద పాయ్ మాట్లాడుతూ అయితే నివేదికలో రెండు నెలలు ఎల్‌నినో సూచిస్తుంటే.. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, రుతుపవనాలపై ఏప్రిల్-మే నెలలో మాత్రమే స్పష్టంగా తెలుస్తుందన్నారు.
పసిఫిక్ ప్రాంతంలో వసంతకాలం తర్వాత పరిస్థితులు మారుతాయన్నారు. ఎల్ నినో, భారత రుతుపవనాల మధ్య విలోమ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సంవత్సరంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే.. ఆ సంవత్సరంలో రుతుపవనాల వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయన్నారు. భారతదేశంలో రుతుపవనాల వర్షాలు హిందూ మహాసముద్రంలోని పరిస్థితులు, యురేషియన్ మంచు పలక, అంతర్గత వాతావరణ వ్యత్యాసాల వంటి అనేక కారణాలతో ప్రభావితమవుతాయన్నారు.
ఎల్ నినో అంటే ఏమిటి?
ఎల్ నినో వాతావరణ వ్యవస్థలో ఒక భాగం. ఇది వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎల్ నినో పరిస్థితులు సాధారణంగా ప్రతి మూడు నుంచి ఆరు సంవత్సరాలకు సంభవిస్తాయి. తూర్పు -మధ్య భూమధ్యరేఖ పసిఫిక్‌లోని సముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడిగా ఉన్నప్పుడు, దాన్ని ఎల్ నినో స్థితి అంటారు. ఎల్ నినో పరిస్థితుల్లో గాలి మోడల్‌ను మారుస్తుంది. దీని కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం ప్రభావితమవుతుంది.