నితిన్ గడ్కరీని చంపేస్తాం.. గంట వ్యవధిలో మూడుసార్లు బెదిరింపులు
విధాత: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామంటూ.. గంట వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని ఆయన నివాసానికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డారు. గడ్కరీ ఆఫీసును కూడా పేల్చేస్తామని చెప్పారు. దీంతో నితిన్ గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నితిన్ ఇంటితో పాటు ఆయన కార్యాలయం వద్ద బందోబస్తు పెంచారు. శనివారం ఉదయం 11:25కు మొదటి కాల్ రాగా, […]

విధాత: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామంటూ.. గంట వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్‌లోని ఆయన నివాసానికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డారు. గడ్కరీ ఆఫీసును కూడా పేల్చేస్తామని చెప్పారు.
దీంతో నితిన్ గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నితిన్ ఇంటితో పాటు ఆయన కార్యాలయం వద్ద బందోబస్తు పెంచారు. శనివారం ఉదయం 11:25కు మొదటి కాల్ రాగా, 11:32, 12:30 గంటలకు వరుసగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.