ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్ల‌ల‌కు జ‌న్మ‌

విధాత‌ : ఆ దంప‌తుల‌కు తొలి కాన్పులో మ‌గ పిల్లాడు జ‌న్మించాడు. అప్పుడు ఆడ‌పిల్ల పుట్టింటే బాగుండు అనుకున్నారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. రెండోసారి కూడా మ‌గ శిశువే పుట్టాడు. ఆడ‌పిల్ల జ‌న్మించ‌లేద‌ని మ‌ళ్లీ నిరాశ‌ప‌డ్డారు. ఆడ‌పిల్ల‌ను క‌నాల‌నే కోరిక‌తో మూడోసారి కూడా ఆమె గ‌ర్భం దాల్చింది. అయితే మూడు కాన్పులో ఆ దంప‌తుల కోరిక ఫ‌లించింది. ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇంకేముంది ఆ దంప‌తుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. వివ‌రాల్లోకి […]

ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్ల‌ల‌కు జ‌న్మ‌

విధాత‌ : ఆ దంప‌తుల‌కు తొలి కాన్పులో మ‌గ పిల్లాడు జ‌న్మించాడు. అప్పుడు ఆడ‌పిల్ల పుట్టింటే బాగుండు అనుకున్నారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. రెండోసారి కూడా మ‌గ శిశువే పుట్టాడు. ఆడ‌పిల్ల జ‌న్మించ‌లేద‌ని మ‌ళ్లీ నిరాశ‌ప‌డ్డారు. ఆడ‌పిల్ల‌ను క‌నాల‌నే కోరిక‌తో మూడోసారి కూడా ఆమె గ‌ర్భం దాల్చింది. అయితే మూడు కాన్పులో ఆ దంప‌తుల కోరిక ఫ‌లించింది. ఒకే కాన్పులో ముగ్గురు ఆడ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇంకేముంది ఆ దంప‌తుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండ‌లంలోని రాంలింగ‌పేట్ గ్రామానికి చెందిన అన‌సూయ‌, ర‌మేశ్ దంపతుల‌కు తొలి రెండు కాన్పుల్లో ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు జ‌న్మించారు. అమ్మాయి కావాల‌ని ఆ దంప‌తులు కోరుకున్నారు. ఇక ఆమె మూడోసారి కూడా గ‌ర్భం దాల్చింది.

నెల‌లు నిండ‌టంతో మంగ‌ళ‌వారం సాయంత్రం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్ప‌త్రిలో చేరింది. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఒకరు 1.600 గ్రాములు, మరొకరు 1.570, ఇంకొకరు 1.440 గ్రాముల బరువు ఉన్నారు. తల్లి, ముగ్గురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఎస్‌ఎన్‌సీయూ నోడల్‌ ఆఫీసర్‌ అనంతరావు తెలిపారు. ఇప్పటికే తమకు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఆడపిల్ల కోసం ఎదురు చూశామని, ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించడం ఆనందంగా ఉందని అనసూయ-రమేశ్‌ దంపతులు తెలిపారు.