ముగ్గురు మహిళా ఖైదీలు పరార్‌

ఐజ్వాల్ సెంట్రల్ జైలు నుంచి ముగ్గురు అండర్ ట్రయల్ మ‌హిళా ఖైదీలు త‌ప్పించుకున్నారు. ప‌రారీలో ఉన్న ఖైదీల కోసం మిజోరం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

ముగ్గురు మహిళా ఖైదీలు పరార్‌
  • ఐజ్వాల్ జైలు నుంచి త‌ప్పించుకున్న ఖైదీలు
  • లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన పోలీసులు


విధాత‌: ఐజ్వాల్ సెంట్రల్ జైలు నుంచి ముగ్గురు అండర్ ట్రయల్ మ‌హిళా ఖైదీలు త‌ప్పించుకున్నారు. ప‌రారీలో ఉన్న ఖైదీల కోసం మిజోరం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఐజ్వాల్‌లోని సెంట్రల్ ఉమెన్స్ జైలు నుంచి గురువారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత 1-2 గంటల మధ్య ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు పరారయ్యారు.


పారిపోయిన ఖైదీల‌ను దిన వీటీ కాంబోయి కుమార్తె నియెంగ్‌బోయి (33), ఐజ్వాల్‌లోని థుంపూయ్‌కు చెందిన వుంగ్‌ఖాన్సువాన్ కుమార్తె లాల్రుఅత్సంగి (28), తుయిరియాల్‌కు చెందిన లాల్వుంగా కుమార్తె లాల్‌చన్మావి (42)గా గుర్తించారు.


ప‌రారీలో ఉన్న‌ ఖైదీల ఆచూకీ తెలిసిన‌వారు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని అధికారులు కోరారు. జోనమ్ పోలీస్ అవుట్‌పోస్ట్ నంబ‌ర్‌కు 8794747295కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల‌ని కోరారు.