Tiger Nageswara Rao Teaser | రవితేజ.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు టీజ‌ర్ ఓ రేంజ్‌లో ఉందిగా!

Tiger Nageswara Rao Teaser | మాస్ మ‌హరాజా ర‌వితేజ‌కి ఇటీవ‌లి కాలంలో పెద్దగా స‌క్సెలు రావ‌డం లేదు. వ‌రుస సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా అల‌రించ‌డం లేదు. ఇప్పుడుగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే చిత్రంతో సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతో రేణూ దేశాయ్ […]

  • By: sn    latest    Aug 17, 2023 5:54 PM IST
Tiger Nageswara Rao Teaser | రవితేజ.. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు టీజ‌ర్ ఓ రేంజ్‌లో ఉందిగా!

Tiger Nageswara Rao Teaser |

మాస్ మ‌హరాజా ర‌వితేజ‌కి ఇటీవ‌లి కాలంలో పెద్దగా స‌క్సెలు రావ‌డం లేదు. వ‌రుస సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా అల‌రించ‌డం లేదు. ఇప్పుడుగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే చిత్రంతో సంద‌డి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. 1970, 80 దశకంలో స్టువర్టు పురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ర‌వితేజ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంతో రేణూ దేశాయ్ వెండితెర రీ ఎంట్రీ ఇస్తుంది. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మేక‌ర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ఇది ఆక‌ట్టుకుంటుంది.

హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో అతి దారుణంగా దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాసు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు అనే వార్త వాయిస్ ఓవర్‌తో టైగర్ నాగేశ్వరరావు టీజర్ మొద‌లు కాగా, అతడి కోసం దేశవ్యాప్తంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తుండ‌డం చూపించారు.

గ‌జ దొంగ అయిన నాగేశ్వరరావును పట్టుకునే బాధ్యతను మురళీ శర్మకు అనుపమే ఖేర్ అప్పగించ‌గా, ఆ త‌ర్వాత వ‌చ్చిన డైలాగ్స్ అదిరిపోయాయి. “నాగేశ్వరరావు (రవితేజ) పాలిటిక్స్‌లోకి వెళ్లి ఉంటే.. తన తెలివితేటలతో ఎలక్షన్ గెలిచే వాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉండే పరుగుతో ఇండియాకు మెడల్ తెచ్చి ఉండేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే తన ధైర్యంతో ఓ యుద్ధమే గెలిచి ఉండేవాడు. దురదృష్టకరంగా వాడు ఓ క్రిమినల్ అయ్యాడు సర్” అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్ కేక పెట్టించింది.

“పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి సర్. కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలు పెట్టాడు” అని మురళీ శర్మ చెప్పిన డైలాగ్ బ‌ట్టి సినిమాలో ర‌వితేజ పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా చూపించారో అర్ధ‌మ‌వుతుంది. బ్రిడ్జిపై వేగంగా వెళుతున్న ట్రైన్‍కు తాడు వేసి టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) చేసే యాక్షన్ సీక్వెన్స్ టీజ‌ర్‌కి స్పెష‌ల్ హైలైట్ అని చెప్పాలి.

ఇక సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్ర‌కాశ్ మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి టీజ‌ర్ తో మాత్రం సినిమాపై భారీ అంచ‌నాలే పెంచారు . నూతన దర్శకుడు అయినప్పటికీ వంశీ టేకింగ్ అద‌ర‌గొట్టేశాడు. టీజర్ మొత్తం 80 దశకంకి తగ్గట్టు డార్క్ థీమ్ తో రూపొందించిన‌ట్టు అర్ద‌మవుతుంది.