Tipper Aaccident: బాలుడి పైనుండి వెళ్లిన టిప్పర్ లారీ

విధాత, హైదరాబాద్ : తల్లితో పాటు స్కూటిపై స్కూలుకు వెలుతున్న బాలుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాదకర ఘటన అందరిని కలిచివేసింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వీడియో వైరల్ గా మారింది. 1వ తరగతి బాలుడు తల్లితో కలిసి స్కూటిపై స్కూల్ కు చేరుకునే క్రమంలో ఓ టిప్పర్ స్కూటిని ఢీ కొట్టింది. దీంతో స్కూటి అదుపు తప్పి పడిపోగా వెనుక కూర్చున్న బాలుడు టిప్పర్ కింద పడిపోయాడు.
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
టిప్పర్ బాలుడిపైనుండి వెళ్లడంతో అతను తల్లి కళ్ల ముందే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో కన్న కొడుకును కోల్పోయిన ఆ తల్లి తీవ్ర దుఃఖం అందరిని కదిలించింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.