Tourism | పర్యాటక అభివృద్ధిలో మరో ముందడుగు..

Tourism ఒబెరాయ్ గ్రూప్ మూడు సెవెన్ స్టార్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన విధాత: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలలో ఒబెరాయ్ గ్రూప్ నిర్మించతలపెట్టిన మూడు సెవెన్ స్టార్స్ హోటల్స్ కు వైఎస్సార్ జిల్లా గండికోట వద్ధ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్‌కు భూమి పూజ చేసిన సీఎం వైయస్.జగన్ విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు కూడా అక్కడే వర్చువల్ గా […]

Tourism | పర్యాటక అభివృద్ధిలో మరో ముందడుగు..

Tourism

  • ఒబెరాయ్ గ్రూప్ మూడు సెవెన్ స్టార్ హోటళ్లకు సీఎం జగన్ శంకుస్థాపన

విధాత: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. గండికోట, తిరుపతి, విశాఖపట్నంలలో ఒబెరాయ్ గ్రూప్ నిర్మించతలపెట్టిన మూడు సెవెన్ స్టార్స్ హోటల్స్ కు వైఎస్సార్ జిల్లా గండికోట వద్ధ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు.

గండికోటలో ఒబెరాయ్ హోటల్‌కు భూమి పూజ చేసిన సీఎం వైయస్.జగన్ విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్ కు కూడా అక్కడే వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యూ పాయింట్ ను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, ఒబెరాయ్ హోటల్స్ ఎండీ విక్రమ్ జిత్ సింగ్ ఒబరాయ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.