Hyderabad | నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad | విధాత: ఈ నెల 8వ తేదీన (నేడు)హైదరాబాద్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈపర్యటనలో భాగంగా మోదీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి […]

Hyderabad |
విధాత: ఈ నెల 8వ తేదీన (నేడు)హైదరాబాద్ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈపర్యటనలో భాగంగా మోదీ సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వివిధ ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- టివోలీ ఎక్స్ రోడ్స్‌ను ప్లాజా ఎక్స్ రోడ్డు వరకు ఇరువైపులా మూసివేయనున్నారు.
- ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్ నుంచి స్వీకార్ ఉపకార్ జంక్షన్ వరకు ఇరువైపులా రోడ్డును మూసివేయనున్నారు.
- చిలకలగూడ, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, రేతిఫెల్ టీ జంక్షన్ల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలకు అనుమతి ఉండదు. ప్రయాణికులు క్లాక్ టవర్ పాస్ పోర్టు ఆఫీస్, రెజిమెంటర్ బజార్ రూట్‌ను ఉపయోగించుకుని సికింద్రాబాద్ స్టేషన్ మెయిన్ గేట్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
- కరీంనగర్ వైపు నుంచి రాజీవ్ రహదారి మీదుగా హైదరాబాద్‌లోకి వచ్చే వారు ఓఆర్ఆర్ మీదుగా దిగి కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
- కీసర ఓఆర్ఆర్ గేట్ నుంచి ఈసీఐఎల్, మౌలాలీ, నాచారం, ఉప్పల్ మీదుగా నగరంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవాలి.
- తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి ఎడమవైపు తీసుకొని ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, మౌలాలీ, తార్నాక నుంచి సిటీలోని ఆయా ప్రాంతాలకు వెళ్లాలి.
- కరీంనగర్ వైపు రాకపోకలు సాగించే వారు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్, జేబీఎస్ రూట్లలో వెళ్లకుండా ఓఆర్ఆర్పై నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు.