బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ట్రాన్స్ జంట‌.. జెండ‌ర్ ఏంటంటే..?

విధాత‌: కేర‌ళలోని కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండ‌ర్ జంట పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కేర‌ళ‌లోని ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో బుధ‌వారం ట్రాన్స్ మెన్ డెలివ‌రీ అయింది. అయితే పుట్టిన బేబి జెండ‌ర్‌ను మాత్రం ఆ జంట ప్ర‌క‌టించ‌లేదు. ఈ సంద‌ర్భంగా ఆ బేబి త‌ల్లి జియా పావెల్ మాట్లాడుతూ.. త‌మ‌కు బిడ్డ జ‌న్మించ‌డం త‌న జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. త‌న‌ను బాధపెట్టే అనేక సందేశాలు త‌న‌కు వచ్చాయ‌ని తెలిపింది. అలాంటి వారికి త‌మ‌కు బిడ్డ పుట్ట‌డ‌మే స‌మాధానం […]

బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ట్రాన్స్ జంట‌.. జెండ‌ర్ ఏంటంటే..?

విధాత‌: కేర‌ళలోని కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండ‌ర్ జంట పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కేర‌ళ‌లోని ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో బుధ‌వారం ట్రాన్స్ మెన్ డెలివ‌రీ అయింది. అయితే పుట్టిన బేబి జెండ‌ర్‌ను మాత్రం ఆ జంట ప్ర‌క‌టించ‌లేదు.

ఈ సంద‌ర్భంగా ఆ బేబి త‌ల్లి జియా పావెల్ మాట్లాడుతూ.. త‌మ‌కు బిడ్డ జ‌న్మించ‌డం త‌న జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. త‌న‌ను బాధపెట్టే అనేక సందేశాలు త‌న‌కు వచ్చాయ‌ని తెలిపింది. అలాంటి వారికి త‌మ‌కు బిడ్డ పుట్ట‌డ‌మే స‌మాధానం అని చెప్పింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపిన వారంద‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పావెల్ చెప్పుకొచ్చింది. జ‌హాద్, శిశువు ఆరోగ్యంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేసింది.

గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిలో బుధ‌వారం ఉద‌యం 9:30 గంట‌ల ప్రాంతంలో సీజేరియ‌న్ ద్వారా బిడ్డ ప్ర‌స‌వించిన‌ట్లు పావెల్ తెలిపింది. బిడ్డ ప్ర‌స‌వించిన స‌మ‌యంలో జ‌హాద్‌కు షుగ‌ర్ లెవ‌ల్స్ అధిక స్థాయిలో న‌మోదు అయ్యాయ‌ని, ఇప్పుడు సాధార‌ణ స్థాయిలో ఉన్నాయ‌ని చెప్పింది.

ఆరోగ్య శాఖ మంత్రి శుభాకాంక్ష‌లు

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఈ ట్రాన్స్ జంట‌కు కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. కోజికోడ్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ జంట‌ను త‌ప్ప‌కుండా క‌లుస్తాన‌ని ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. జ‌హాద్, శిశువుకు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆరోగ్య శాఖ అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

కోజికోడ్‌కు చెందిన జియా పావెల్, జ‌హాద్ అనే ట్రాన్స్‌జెండ‌ర్ జంట మూడేండ్ల నుంచి స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. అబ్బాయిగా పుట్టిన పావెల్ అమ్మాయిలా మారింది. అమ్మాయిలా పుట్టిన జ‌హాద్ అబ్బాయిలా మారే క్ర‌మంలోనే గ‌ర్భం ధ‌రించాడు. దీంతో అబ్బాయిలా మారే ప్ర‌క్రియ‌ను జ‌హాద్ వాయిదా వేసుకున్నాడు.

త‌ల్లిదండ్రులు కాబోతున్న ట్రాన్స్‌జెండర్ జంట‌.. దేశంలోనే తొలిసారి