బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి: MLC అలుగుబెల్లి
విధాత: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన టీఎస్ యుటీఎఫ్ జిల్లా ఐదో మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని అమెరికా, చైనా లాంటి దేశాలలో మాదిరిగా విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని సూచించారు. అందరి పిల్లల్నీ ప్రభుత్వ బడుల్లో చదివిస్తేనే ఈ విద్యా వ్యవస్థ […]

విధాత: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన టీఎస్ యుటీఎఫ్ జిల్లా ఐదో మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని అమెరికా, చైనా లాంటి దేశాలలో మాదిరిగా విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని సూచించారు. అందరి పిల్లల్నీ ప్రభుత్వ బడుల్లో చదివిస్తేనే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో 4000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2000 పాఠశాలలో హెడ్మాస్టర్లు లేరని ప్రభుత్వ విద్య బాగుపడాలంటే వెంటనే ఉపాధ్యాయుల ఖాళీలను ప్రమోషన్లతో నింపాలని, నూతన నియామకాలు, బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ, రాష్ట్ర భవిష్యత్తు ఆధార పడి ఉందన్నారు. మంచి శిష్యులను తయారు చేయాలని మీకు కావలసిన సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, ఏకపక్ష, మతతత్వ విధానాల వల్ల దేశంలోని సంపద కొందరి చేతుల్లోనే ఉందని విద్యా వ్యవస్థపై బలవంతంగా తన ఎజెండాను రుద్దుతుందన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ హిందీని ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడుతుండగా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేశమంతటా అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశం, రాష్ట్ర కార్యదర్శిలు ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి, ఉపాధ్యక్షులు శ్రీనివాసచారి, అరుణ, కోశాధికారి, శేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, నాయకులు లక్ష్మారెడ్డి, సత్యనారాయణ రావు, సురేందర్ రెడ్డి, వివిధ మండలాల బాధ్యులు, టీఎస్ యుటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.