ఈడీ విచారణకు హాజ‌రైన తెలంగాణ కాంగ్రెస్‌ నేత‌లు

విధాత‌, ఢిల్లీ: నేష‌నల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస నేత‌లు ఈడీ ముందు హాజ‌ర‌య్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళ‌మిచ్చిన వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ‌, రేపు ఈడీ ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లు హాజ‌రుకానున్నారు. మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ ఇప్ప‌టికే ఈడీ ముందు హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌రో మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌వారం ఈడీ ముందుకు రావాల్సి ఉన్నా.. నేత‌లు హాజ‌రు […]

  • By: Somu    latest    Oct 06, 2022 10:25 AM IST
ఈడీ విచారణకు హాజ‌రైన తెలంగాణ కాంగ్రెస్‌ నేత‌లు

విధాత‌, ఢిల్లీ: నేష‌నల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస నేత‌లు ఈడీ ముందు హాజ‌ర‌య్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళ‌మిచ్చిన వారిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ‌, రేపు ఈడీ ముందు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన కాంగ్రెస్ నేత‌లు హాజ‌రుకానున్నారు.

మాజీ మంత్రి ష‌బ్బీర్ అలీ ఇప్ప‌టికే ఈడీ ముందు హాజ‌రై వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌రో మాజీ మంత్రి గీతారెడ్డి కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మంగ‌ళ‌వారం ఈడీ ముందుకు రావాల్సి ఉన్నా.. నేత‌లు హాజ‌రు కాలేదు. ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప‌లువురి నుంచి ఈడీ అధికారులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.