తెలంగాణ ఎంసెట్ ప‌రీక్ష‌ల తేదీల్లో స్వ‌ల్ప మార్పు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణలో జ‌ర‌గాల్సిన ఈఏపీసెట్(ఎంసెట్), ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు

తెలంగాణ ఎంసెట్ ప‌రీక్ష‌ల తేదీల్లో స్వ‌ల్ప మార్పు..

హైద‌రాబాద్ : లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణలో జ‌ర‌గాల్సిన ఈఏపీసెట్(ఎంసెట్), ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఎంసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను గ‌త షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే నిర్వ‌హించాల‌ని ఉన్న‌త విద్యామండ‌లి నిర్ణ‌యించింది. ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను ఒక రోజు పోస్టు పోన్ చేసింది.

ముందుగా నిర్ణ‌యించిన‌ షెడ్యూల్‌ ప్రకారం ఎప్‌సెట్‌ పరీక్షలు మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. పరీక్షలకు, ఎన్నికల పోలింగ్‌ తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్‌ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎప్‌ సెట్‌ తేదీల్లో మార్పులు చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4, 5వ తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్‌ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్‌ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం.. జూన్‌ 5, 6వ తేదీల్లో ఐసెట్‌ పరీక్ష జరగనుంది.