హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. గ్రూప్ -2 రాతపరీక్షలను ఆగస్టు 7, 8 తేదీల్లో, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 కింద 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3 కింద 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్షల తేదీలను ప్రకటించడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, పుస్తకాలతో కుస్తీలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు