TSPSC | రేపే గ్రూప్-1 ప్రిలిమిన‌రీ.. అక్ర‌మాల‌కు పాల్ప‌డితే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు

TSPSC | ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 994 ప‌రీక్షా కేంద్రాల్లో ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌రీక్ష ఉద‌యం 10:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది. అయితే ప‌రీక్షా ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ల‌ను క్లోజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డితే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని టీఎస్‌పీఎస్సీ హెచ్చ‌రించింది. […]

TSPSC | రేపే గ్రూప్-1 ప్రిలిమిన‌రీ.. అక్ర‌మాల‌కు పాల్ప‌డితే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు

TSPSC | ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 994 ప‌రీక్షా కేంద్రాల్లో ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ప‌రీక్ష ఉద‌యం 10:30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు జ‌ర‌గ‌నుంద‌ని తెలిపింది. అయితే ప‌రీక్షా ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ల‌ను క్లోజ్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌కు పాల్ప‌డితే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని టీఎస్‌పీఎస్సీ హెచ్చ‌రించింది.

ప‌రీక్షా కేంద్రంలోకి చేతి గ‌డియారాలు, స్మార్ట్ వాచ్‌లు, హ్యాండ్ బ్యాగ్స్, ప‌ర్సులు, క్యాలికులేట‌ర్స్ అనుమ‌తించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. చెప్పుల‌తోనే రావాల‌ని, షూ ధ‌రిస్తే అనుమ‌తించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పింది. బ్లాక్ లేదా బ్లూ క‌ల‌ర్ పెన్ మాత్ర‌మే వాడాల‌ని సూచించింది.

ఇక వైట్‌న‌ర్, చాక్ పౌడ‌ర్, బ్లేడు, ఎరేజ‌ర్‌తో బ‌బ్లింగ్ చేసే ఓఎంఆర్ షీటు చెల్లదు అని టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది. మొత్తంగా ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు 3,80,072 మంది హాజ‌రు కానున్నారు.