TSRTC | పంద్రాగస్టు ప్రత్యేక ఆఫర్.. సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ, రూ. 75కే T-24 టికెట్
TSRTC | టీఎస్ ఆర్టీసీ మరో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పంద్రాగస్టు రోజున పల్లె వెలుగు సబ్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్‌ను కేవలం రూ. 75కే ఇవ్వాలని నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం […]

TSRTC |
టీఎస్ ఆర్టీసీ మరో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. పంద్రాగస్టు రోజున పల్లె వెలుగు సబ్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ సిటీలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్‌ను కేవలం రూ. 75కే ఇవ్వాలని నిర్ణయించింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను #TSRTC ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) August 13, 2023
పిల్లలకు అయితే ఈ టికెట్‌ను రూ. 50కే అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీలు స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే వర్తిస్తాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.