ఎమ్మెల్యేల కొనుగోలు: తుషార్ అరెస్టుకు వీల్లేదు: హైకోర్టు

విధాత‌: సిట్ విచార‌ణపై స్టే విధించాల‌ని కేర‌ళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్ హైకోర్టులో పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. తుషార్ వేసిన పిటిష‌న్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 41- ఏ నోటీస్‌ ఇచ్చి నిందితుల జాబితాలో చేర్చారని, లుక్‌ ఔట్‌ నోటీస్‌ ఎలా ఇస్తారని తుషార్‌ తరఫున న్యాయవాది వాదించారు. తుషార్‌ను అరెస్టు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తుషార్‌ సిట్‌ విచారణకు సహకరించాలని సూచించింది.

  • By: krs    latest    Nov 30, 2022 9:40 AM IST
ఎమ్మెల్యేల కొనుగోలు: తుషార్ అరెస్టుకు వీల్లేదు: హైకోర్టు

విధాత‌: సిట్ విచార‌ణపై స్టే విధించాల‌ని కేర‌ళ బీడీజేఎస్‌ అధ్యక్షుడు తుషార్ హైకోర్టులో పిటిషన్ వేసిన విష‌యం తెలిసిందే. తుషార్ వేసిన పిటిష‌న్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

41- ఏ నోటీస్‌ ఇచ్చి నిందితుల జాబితాలో చేర్చారని, లుక్‌ ఔట్‌ నోటీస్‌ ఎలా ఇస్తారని తుషార్‌ తరఫున న్యాయవాది వాదించారు.

తుషార్‌ను అరెస్టు చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తుషార్‌ సిట్‌ విచారణకు సహకరించాలని సూచించింది.