Twitter | మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌..!

Twitter Down | ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్విట్టర్‌ సర్వర్‌ మరోసారి డౌన్‌ అయ్యింది. ఫలితంగా వినియోగదారులు తమ అకౌంట్లను లాగిన్‌ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నారు. అలాగే ట్వీట్‌డెక్‌ సైతం పని చేయడం లేదు. అలాగే పలువురు యూజర్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాగిన్‌లోనూ సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మరికొందరు యూట్యూబ్‌లోనూ సమస్య ఉందని మరికొందరు పేర్కొన్నారు. ట్విట్టర్‌లో సాంకేతిక సమస్యలు పలువురు ఫిర్యాదు చేయగా.. వాటిని చక్కదిద్దేందుకు ట్విట్టర్‌ ప్రయత్నాలు చేస్తున్నది. సమాచారం ప్రకారం.. బుధవారం […]

Twitter | మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌..!

Twitter Down | ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్విట్టర్‌ సర్వర్‌ మరోసారి డౌన్‌ అయ్యింది. ఫలితంగా వినియోగదారులు తమ అకౌంట్లను లాగిన్‌ చేయడంలో సమస్యను ఎదుర్కొన్నారు. అలాగే ట్వీట్‌డెక్‌ సైతం పని చేయడం లేదు. అలాగే పలువురు యూజర్లు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాగిన్‌లోనూ సమస్యలను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. మరికొందరు యూట్యూబ్‌లోనూ సమస్య ఉందని మరికొందరు పేర్కొన్నారు. ట్విట్టర్‌లో సాంకేతిక సమస్యలు పలువురు ఫిర్యాదు చేయగా.. వాటిని చక్కదిద్దేందుకు ట్విట్టర్‌ ప్రయత్నాలు చేస్తున్నది.

సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రి నుంచి ట్విట్టర్‌ యూజర్లు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో సమస్యలు ఎదుర్కొన్నారు. ట్వీట్‌, రీ ట్వీట్‌ చేయడంలో సమస్యలు ఎదురయ్యాయి. కొత్త పోస్టులు చేసేందుకు ప్రయత్నించినా ‘మీరు ట్వీట్‌లను పంపేందుకు రోజువారీ పరిమితిని మించిపోయారు’ అంటూ మిస్సేజ్‌ చూపించిందని, మమ్మల్ని క్షమించండి..! మేము మీ ట్వీట్‌ను పంపలేకపోయాము’ అన్న మెస్సేజ్‌లు స్క్రీన్‌పై కనిపించాయని పలువురు యూజర్లు తెలిపారు. ఇటీవల కాలంలో ట్విట్టర్‌లో సాంకేతిక సమస్యలు ఎక్కువయ్యాయి. గతేడాదిలో చాలాసార్లు సర్వర్‌ డౌన్‌, సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు.