Planes Collide | టేకాఫ్‌కు వెళ్తూ ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం.. అమెరికాలో ఘటన

Planes Collide | అమెరికా (America)లోని బోస్టన్‌ లోగాన్‌ ( Boston Logan) అంతర్జాతీయ విమానాశ్రయంలో (International Airport)లో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ (United Airlines)కు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ దీన్ని ధ్రువీకరించింది. విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం-515 రెక్కను అదే కంపెనీకి చెందిన 267 విమానం చివరి భాగం తాకింది. రెండు విమానాలు ఒకదానికొకటి తాకడంతో […]

Planes Collide | టేకాఫ్‌కు వెళ్తూ ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. తప్పిన పెను ప్రమాదం.. అమెరికాలో ఘటన

Planes Collide | అమెరికా (America)లోని బోస్టన్‌ లోగాన్‌ ( Boston Logan) అంతర్జాతీయ విమానాశ్రయంలో (International Airport)లో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ (United Airlines)కు చెందిన రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ దీన్ని ధ్రువీకరించింది. విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం-515 రెక్కను అదే కంపెనీకి చెందిన 267 విమానం చివరి భాగం తాకింది.

రెండు విమానాలు ఒకదానికొకటి తాకడంతో విమానాలు కుదుపులకు గురయ్యాయి. అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రెండు విమానాలు బయలుదేరడానికి షెడ్యూల్‌ చేసిన బోయింగ్‌ 737 విమానాలని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం తర్వాత రెండు విమానాల్లో ఉన్న ప్రయాణికులను ఇతర విమానాల్లో ఎక్కించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో విమానాలు నేలపై ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. విమానం టేకాఫ్‌ కోసం వెళ్తున్న సమయంలో ఈ ఘటన విమానం కుదుపులకు గురవడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురై కేకలు వేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడంతో ఊపిరిపీల్చుకున్నారు.