Jammu Kashmir | జ‌మ్మూక‌శ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. ఇద్ద‌రు జ‌వాన్లు మృతి

Jammu Kashmir విధాత‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిలో ఆర్మీ ఆఫీస‌ర్ ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి మాట్లాడుతూ.. రాజౌరీ జిల్లాలోని కేస్రీ హిల్ ఏరియాలో ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్న‌ట్లు బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో అక్క‌డ జ‌వాన్లు కూంబింగ్ నిర్వ‌హించారు. జ‌వాన్ల క‌దిలిక‌ల‌ను […]

Jammu Kashmir | జ‌మ్మూక‌శ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. ఇద్ద‌రు జ‌వాన్లు మృతి

Jammu Kashmir

విధాత‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోగా, మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిలో ఆర్మీ ఆఫీస‌ర్ ఉన్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ శాఖ అధికార ప్ర‌తినిధి మాట్లాడుతూ.. రాజౌరీ జిల్లాలోని కేస్రీ హిల్ ఏరియాలో ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్న‌ట్లు బ‌ల‌గాల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో అక్క‌డ జ‌వాన్లు కూంబింగ్ నిర్వ‌హించారు.

జ‌వాన్ల క‌దిలిక‌ల‌ను గ‌మ‌నించిన ఉగ్ర‌వాదులు బాంబులను పేల్చారు. కాల్పులు జ‌రిపారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు జ‌వాన్లు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలొదిలారు. మ‌రో న‌లుగురికి తీవ్రంగా గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఉధంపూర్‌లోని క‌మాండ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాజౌరీ జిల్లాలో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేశారు. ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే ఏప్రిల్ 20వ తేదీన ఫూంచ్ జిల్లాలోని భ‌టా దుహ్రేన్ వ‌ద్ద ఆర్మీ ట్ర‌క్కును ఉగ్ర‌వాదులు పేల్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌లో ఐదుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు.