Delhi | ఇద్దరు మహిళల సజీవ దహనం.. ఎక్కడంటే!
ఢిల్లీలో ఘజియాబాద్‌లో చెలరేగిన మంటలు మరో ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థత విధాత: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో సోమవారం ఉదయం వేళ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఘజియాబాద్‌లోని లాల్‌భాగ్ కాలనీలో ఉదయం చెలరేగిన మంటల్లో ఇద్దరు మహిళలు సజీవ దహనమైనట్టు తెలుస్తున్నది. దట్టమైన పొగ కారణంగా మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజమున 5.30 గంటల ప్రాంతంలో లాల్‌భాగ్ కాలనీలో మంటలు చెలరేగాయి. స్థానికులు బకెట్ల ద్వారా నీళ్లు చల్లుతూ […]

- ఢిల్లీలో ఘజియాబాద్‌లో చెలరేగిన మంటలు
- మరో ఎనిమిది మందికి తీవ్ర అస్వస్థత
విధాత: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో సోమవారం ఉదయం వేళ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఘజియాబాద్‌లోని లాల్‌భాగ్ కాలనీలో ఉదయం చెలరేగిన మంటల్లో ఇద్దరు మహిళలు సజీవ దహనమైనట్టు తెలుస్తున్నది. దట్టమైన పొగ కారణంగా మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సోమవారం తెల్లవారుజమున 5.30 గంటల ప్రాంతంలో లాల్‌భాగ్ కాలనీలో మంటలు చెలరేగాయి. స్థానికులు బకెట్ల ద్వారా నీళ్లు చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ప్రాంతంలో మొత్తం దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడక మరో ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు సమీప దవాఖానకు తరలించారు. ఇద్దరు మహిళలు మాత్రం తీవ్ర కాలిన గాయాలతో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.