BJP ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు.. రెండేళ్ల జైలు

BJP అనర్హత పై చర్య లేవ‌ని ప్ర‌శ్నించిన కాంగ్రెస్ విధాత: ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపి ఎంపీ రామ్ శంకర్ కతేరియా కు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కతేరియా యూపీలోని ఎటావా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2011లో ఆగ్రాలోని టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన కేసులో ఆయనకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా బిజేపీ […]

BJP ఎంపీ రామ్ శంకర్ కతేరియాకు.. రెండేళ్ల జైలు

BJP

  • అనర్హత పై చర్య లేవ‌ని ప్ర‌శ్నించిన కాంగ్రెస్

విధాత: ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపి ఎంపీ రామ్ శంకర్ కతేరియా కు ఆగ్రా కోర్టు శనివారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కతేరియా యూపీలోని ఎటావా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2011లో ఆగ్రాలోని టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన కేసులో ఆయనకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా బిజేపీ ఎంపీ కతేరియాకు రెండేళ్ల శిక్ష నేపథ్యంలో రాహుల్ గాంధీ శిక్ష పై స్పందించిన రీతిలో వేగంగా కేంద్రం ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని కాంగ్రెస్ నిలదీస్తుంది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని తక్షణమే పునరుద్ధరించా లని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయంలో అవసరమైన అన్ని పత్రాలను సమర్పించారు.

స్పీకర్ సూచన మేరకు ఆ పత్రాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ కు అందించారు. మొత్తం మీద బిజెపి ఎంపీకి పడిన రెండేళ్ల శిక్ష పై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.