UI The Movie | వామ్మో.. ఇదేం టీజర్ నాయనో.. నెవ్వర్ బిఫోర్.. ఉప్పీ అరిపించేశాడు

UI The Movie | వామ్మో.. ఇదేం టీజర్ నాయనో.. నెవ్వర్ బిఫోర్.. ఉప్పీ అరిపించేశాడు

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర పేరు వినబడితే చాలు.. వైవిధ్యానికి మారు పేరు అనే అంటారు. అందుక్కారణం ఆయన సినిమాలే. ఉపేంద్ర సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. అన్ని సినిమాలు వేరు.. ఉపేంద్ర సినిమాలు వేరు అన్నట్లుగా.. చాలా ప్రత్యేకతను సంతరించుకుంటాయి ఉపేంద్ర సినిమాలు.

అయితే కొంత కాలంగా ఉపేంద్ర నుంచి సరైన హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల వచ్చిన ‘కబ్జా’ కూడా ఆయనకి హిట్ ఇవ్వలేకపోయింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ఉపేంద్ర.. ఈసారి మాములుగా రావడం లేదు. ఉపేంద్ర హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘UI The Movie’. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన వారంతా.. సారీ విన్న వారంతా.. ఇదేం టీజర్ నాయనో.. నెవ్వర్ బిఫోర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే.. ఏ రేంజ్‌లో టీజర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అదేంటి టీజర్.. వినడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా.. అవును.. అందరిలా చేస్తే ఉపేంద్ర స్పెషాలిటీ ఏముంటుంది.. అందుకే కేవలం డార్క్‌ని మాత్రమే చూపిస్తే.. ఓన్లీ వాయిస్‌తో టీజర్‌ నడిపించేశాడు. అలాగే ఈ టీజర్ ఎవరు ఎలా ఊహించుకోవాలో.. అలా ఊహించుకోండి అంటూ.. టీజర్ ఇమాజినేషన్‌ను కూడా ప్రేక్షకులకే వదిలేశాడు.

ఈ టీజర్‌లో ‘‘చీకటి.. అంతా చీకటి. అసలిది ఎలాంటి చోటు. నీళ్ల శబ్ధం వినబడుతోంది. (ఆకలి అంటూ ఆర్తనాదాలు).. ఈ చీకటి నుంచి తప్పించుకోవడం ఎలా? వెలుతురు పడ్డా.. అలికిడి విన్నా ఎటాక్ చేస్తారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం ఎలా? కామ్‌గా ఆలోచించు.. కాన్సన్‌ట్రేట్. దిస్ ఈజ్ నాట్ AI వరల్డ్.. దిస్ ఈజ్ UI వరల్డ్. బయటపడాలంటే.. నీ తెలివిని ఉపయోగించు..’’ అంటూ ఈ టీజర్ మీ ఊహ కోసమే అని ముగించారు.

బొమ్మ కనపడకపోయినా.. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. అందుకే అంది.. ఉపేంద్ర సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ ప్రయోగం కూడా ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ ఇంపాక్ట్ సోషల్ ప్రపంచంలో బాగానే ఉంది. ఇక సినిమాతో ఎలా ఆడేసుకుంటాడో చూడాలి మరి. 

కాగా.. లహరి ఫిలింస్, జి మనోహరన్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్, కె పి శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉపేంద్ర హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్‌గా నటిస్తోంది. నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమా విడుదల కానుంది.