Flight | గాల్లో ఉన్న విమానం తలుపు తీయడానికి వ్యక్తి ప్రయత్నం… నిలువరించిన ఇద్దరు యువకులు
విధాత: టేకాఫ్ అయిన విమానం (Flight) తలుపును ఓ వ్యక్తి తీయడానికి ప్రయత్నించడంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇద్దరు యువకులు తక్షణం స్పందించి అతణ్ని నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది. జాదర్ నుంచి క్రొయేషియా వెళుతున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ఈ ఘటన జరిగింది. నిందితుడ్ని యూకే (UK) కు చెందిన బాక్సర్‌గా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.