Umair Sandhu | అల్లు అర్జున్‌- రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ.. ఉమైర్‌ సంధు పోస్ట్‌.. మండిపడుతున్న అభిమానులు..!

Umair Sandhu | ఉమైర్‌ సంధు పేరు అందరికీ తెలిసిందే. ఆయనో ప్రముఖ ఫిలిం క్రిటిక్‌. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ విశ్లేషకుల్లో ఒకడు. సినిమాలకు రివ్యూలు ఇవ్వడమే కాదు.. ఉన్నవి లేనివి కలిపి సెలబ్రిటీల మధ్య లింకులు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. హీరో హీరోయిన్లు కాస్త చనువుగా కనిపించినా చాలు.. వారిమధ్య ఎఫైర్‌ నడుస్తున్నట్లు వివాదాలు రాజేస్తుంటాడు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్‌, టాలీవుడ్‌ తదితర సినీ ప్రముఖలకు లింకులు అంటగట్టాడు. తాజాగా.. […]

Umair Sandhu | అల్లు అర్జున్‌- రష్మిక రిలేషన్‌లో ఉన్నారంటూ.. ఉమైర్‌ సంధు పోస్ట్‌.. మండిపడుతున్న అభిమానులు..!

Umair Sandhu | ఉమైర్‌ సంధు పేరు అందరికీ తెలిసిందే. ఆయనో ప్రముఖ ఫిలిం క్రిటిక్‌. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ విశ్లేషకుల్లో ఒకడు. సినిమాలకు రివ్యూలు ఇవ్వడమే కాదు.. ఉన్నవి లేనివి కలిపి సెలబ్రిటీల మధ్య లింకులు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.

హీరో హీరోయిన్లు కాస్త చనువుగా కనిపించినా చాలు.. వారిమధ్య ఎఫైర్‌ నడుస్తున్నట్లు వివాదాలు రాజేస్తుంటాడు. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్‌, టాలీవుడ్‌ తదితర సినీ ప్రముఖలకు లింకులు అంటగట్టాడు. తాజాగా.. అల్లు అర్జున్, రష్మికలను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

‘అల్లు అర్జున్‌ కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌ రష్మికతో ప్రైవేట్‌ ప్లేన్‌లో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాడు. బన్నీ వైఫ్‌కి ఈ విషయం తెలిసినా ఆమె దీన్ని పట్టించుకోలేదు’ అంటూ ఫొటోను సైతం పోస్ట్‌ చేశాడు. అయితే, ఈ ఫొటోలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సైతం ఉన్నాడు.

అయితే, ఈ ట్వీట్‌ను చూసిన అల్లు అర్జున్‌ అభిమానులు ఉమర్‌ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు రిలేషన్‌లో ఉండడమేంటని మండిపడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ తనయుడు ఇబ్రహీం అలీఖాన్‌ను గే అని, బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను ఉద్దేశించి యూఏఈ, మిడిల్‌ ఈస్ట్‌లో హై ఫై నైట్‌గర్ల్‌ అంటూ చెత్త ట్వీట్లు చేశాడు.

ఈ ట్వీట్లు చేసినా వారంతా విమర్శలు గుప్పించినా.. పట్టించుకోకుండా అడ్డగోలుగా విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న పుష్ప-2లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌ ఆకట్టుకున్నది. అందులో కాళీ అలంకారంలో ఉన్న బన్నీని చూసి జనాలందరూ షాక్‌ అయ్యారు.