చైనీస్ స్పై బెలూన్‌ను కూల్చివేసిన అమెరికా..
వాషింగ్టన్: చైనాకు చెందిన స్పై బెలూన్‌ను అమెరికాలో ప్రత్యక్షంకావడంతో ఇరుదేశాల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అమెరికా మీదుగా ఎరుగుతున్న ఈ చైనీస్ బెలూన్‌ను అగ్రరాజ్యం సముద్రంపై పేల్చివేసింది. ఉత్తర అమెరికాలోని సున్నితమైన సైనిక ప్రాంతాల నుంచి వెళ్లిన అనుమానాస్పద బెలూన్‌ను శనివారం కరోలినా తీరంలో కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రంపై తిరుగుతున్న స్పై బెలూన్‌ను అమెరికా కూల్చివేసిందని, దీనికి అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలుపగా.. సైనిక అధికారులు మద్దతు తెలిపినట్లు ఓ అమెరికన్ అధికారిని […]

వాషింగ్టన్: చైనాకు చెందిన స్పై బెలూన్‌ను అమెరికాలో ప్రత్యక్షంకావడంతో ఇరుదేశాల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది. అమెరికా మీదుగా ఎరుగుతున్న ఈ చైనీస్ బెలూన్‌ను అగ్రరాజ్యం సముద్రంపై పేల్చివేసింది. ఉత్తర అమెరికాలోని సున్నితమైన సైనిక ప్రాంతాల నుంచి వెళ్లిన అనుమానాస్పద బెలూన్‌ను శనివారం కరోలినా తీరంలో కూల్చివేసింది.
అట్లాంటిక్ మహాసముద్రంపై తిరుగుతున్న స్పై బెలూన్‌ను అమెరికా కూల్చివేసిందని, దీనికి అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలుపగా.. సైనిక అధికారులు మద్దతు తెలిపినట్లు ఓ అమెరికన్ అధికారిని ఉటంకిస్తూ సీఎన్‌ఎన్ తెలిపింది. ఈ వారం మొదట్లో బెలూన్ మోంటానాపై తొలిసారి కనిపించింది.
చైనీస్ స్పై బెలూన్‌ను కూల్చివేసిన అమెరికా.. https://t.co/KjiZevY4QO #ChineseSpyBalloon #America Trump’s Chinese #XiJinping #jobiden #USA pic.twitter.com/G1R7SEBgjk
— vidhaathanews (@vidhaathanews) February 5, 2023
బెలూన్‌ను కూల్చే ముందు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నార్త్ కరోలినాలోని విల్మింగ్టన్, సౌత్ కరోలినాలోని చార్లెస్టన్, సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌లోని విమానాశ్రయాలకు గ్రౌండ్‌స్టాప్ జారీ చేయడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు యూఎస్ ఫైటర్ జెట్లు అమెరికా గగనతలంలో సౌత్ కరోలినా తీరంలో సముద్రంపై చైనీస్ నిఘా బెలూన్‌ను కూల్చివేసినట్లు యూఎస్ డిఫెన్స్ సెక్రెటరీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
సున్నిత ప్రాంతాల మీదుగా స్పై బెలూన్ ఎగరడంపై అమెరికా తీవ్రంగా పరిగణించింది. అయితే, బెలూన్ దారి తప్పిందని పేర్కొంది. ఆంటోని బ్లింకెన్ చైనా పర్యటనను రద్దు చేసుకోవడం దురదృష్టకరమని విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా తన వైఖరి మార్చుకోవాలన్నారు.