ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా
మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

- సోనియా, రాహుల్‌లతో భేటీ
విధాత : మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లి స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన హుజూర్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
అనంతరం ఉత్తమ్ కుమార్‌రెడ్డి తన సతీమణి కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతితో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఎంపీ పదవికి రాజీనామా చేశానని, అలాగే మర్యాద పూర్వకంగానే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలువడం జరిగిందని, వారితో ఎలాంటి రాజకీయాలు చర్చించలేదన్నారు.