సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వీహెచ్‌

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వీహెచ్‌
  • నాయకులందరికి కలుపుకుని పోతానన్న రేవంత్‌రెడ్డి


విధాత: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాజాగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు తనకు అవకాశం దొరకడం లేదంటూ, గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులు ఎత్తివేయకపోవడంపైన, వలసలపైన ఆయన సీఎంపై మీడియా ముందు అసమ్మతి వెళ్లగక్కారు. ఖమ్మం పార్లమెంటు టికెట్ ఇవ్వకపోవలడంతో అలకబూనిన విహెచ్ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


ఈ నేపథ్యంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విహెచ్‌తో మాట్లాడి బుజ్జగించారు. సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు. అన్ని విధాల విహెచ్‌కు అండగా ఉంటానని, విహెచ్ లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని, ఆయన తగ్గ పదవి అప్పగించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు హామీ ఇచ్చారు. నాయకులందరినీ కలువుకుని వెళ్లాలన్న ఆలోచనతోనే తాను ఉన్నానని రేవంత్ స్పష్టం చేశారు.