Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారీ రెండు రూట్లలో వందేభారత్‌ పరుగులు! ప్రధాని మోదీ గ్రీన్‌ సిగ్నల్‌..!

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఒకేసారి రెండు వందేభారత్‌ రైళ్లు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైళ్లకు ఆదరణ లభిస్తుండడంతో కొత్తగా మరో రెండుమార్గాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లను భారతీయ రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇందులో ఒకటి కాచిగూడ - యశ్వంత్‌పూర్‌ - కాచిగూడ, మరో రైలు విజయవాడ - చెన్నై - విజయవాడ మార్గంలో నడువనున్నాయి. అయితే, ఈ నెల 6న ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని […]

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారీ రెండు రూట్లలో వందేభారత్‌ పరుగులు! ప్రధాని మోదీ గ్రీన్‌ సిగ్నల్‌..!

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో ఒకేసారి రెండు వందేభారత్‌ రైళ్లు ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న రైళ్లకు ఆదరణ లభిస్తుండడంతో కొత్తగా మరో రెండుమార్గాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లను భారతీయ రైల్వే బోర్డు నిర్ణయించింది.

ఇందులో ఒకటి కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ – కాచిగూడ, మరో రైలు విజయవాడ – చెన్నై – విజయవాడ మార్గంలో నడువనున్నాయి. అయితే, ఈ నెల 6న ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ప్రారంభం తేదీని మార్చినట్లుగా సమాచారం. ఈ రెండు రైళ్లతో పాటు మరో రెండు మార్గాల్లో కలిపి ఆగస్టు 15న ఒకేసారి ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.

విజయవాడ – చెన్నై రూట్‌.. టైమ్సింగ్స్‌..

విజయవాడ – చెన్నై మార్గంలో ప్రస్తుతం డిమాండ్‌ భారీగా ఉన్నది. ఈ క్రమంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను తీసుకురావాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడ -చెన్నై మధ్య 431 కిలో మీటర్ల దూరం ఉన్నది. ప్రస్తుతం తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ 5.45 గంటల్లో గమ్యం చేరుకుంటుంది. వందే భారత్‌ రైలు విజయవాడ నుంచి చెన్నైకి ఐదుగంటల్లోనే చేరనున్నది.

సమాచారం మేరకు ఉదయం 8 గంటలకు విజయవాడలో రైలు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చెన్నైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్నాహ్నం 3 గంటలక చెన్నైలో బయల్దేరి రాత్రి 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఆ మార్గంలో రేణిగుంట మీదుగా నడువనుండగా.. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రైలు ఆగనున్నది. ఒక్కో స్టేషన్‌లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే రైలు ఆగుతుంది.

కాచిగూడ – యశ్వంత్‌పూర్‌ ఇలా..

కాచిగూడ నుంచి యశ్వంతపూర్ రైలు నంద్యాల జిల్లా డోన్‌ మీదుగా ప్రయాణించనున్నది. హైదరాబాద్ – బెంగళూరు రెండు ఐటీ సిటీల మధ్య రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 గంటల దాకా సమయం పడుతుంది. వందేభారత్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం 7 గంటల్లో గమ్యస్థానం చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సెమీ హైస్పీడ్‌ రైలుతో దాదాపు నాలుగ గంటల వరకు ప్రయాణ సమయం తగ్గనున్నది.

మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బెంగళూరు చేరుకొనేలా కాచిగూడ – యశ్వంతపూర్ వందేభారత్ రూట్ మ్యాప్‌ను అధికారులు ఖరారు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రైళ్లలో మొదట ఎనిమిదికోచ్‌లతో ప్రారంభించనున్నారు. రెండు రైళ్లల్లోనూ ఎగ్జిక్యూటివ్, ఏడు ఏసీ ఛైర్ కార్లతో నిర్వహించనున్నారు.

అయితే, ఇప్పటికే రెండు రైళ్ల ట్రయల్‌ రన్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం అధికారులు ఈనెల 15న ప్రధాని మోదీతో ప్రారంభింపచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు పాట్నా – హౌరా, చెన్నై – తిరునల్వేలి మార్గంలోనే వందేభారత్‌ రైళ్లు పరుగులుపెట్టనున్నాయి.