ఫ్లాపైన వారసుడికి.. దిల్ రాజు తప్పుడు లెక్కలు?

DIL RAJU విధాత: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుది పక్క కమర్షియల్ మైండ్, ఎవరైనా స్టార్ను కాకా ప‌ట్టాలంటే ఆయన వారికి తనదైన ఫేక్ కలెక్షన్లు చూపిస్తూ మన చిత్రం అంత వసూలు చేసింది ఇంత వసూలు చేసిందని చెబుతూ పక్కదారి పట్టిస్తారు. ఇక తాజాగా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో వారీసు చిత్రం చేశారు. ఈ చిత్రం తమిళంలో పరవాలేదు అనిపించింది. తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. కానీ దిల్ […]

  • By: krs    latest    Jan 27, 2023 7:33 AM IST
ఫ్లాపైన వారసుడికి.. దిల్ రాజు తప్పుడు లెక్కలు?

DIL RAJU

విధాత: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుది పక్క కమర్షియల్ మైండ్, ఎవరైనా స్టార్ను కాకా ప‌ట్టాలంటే ఆయన వారికి తనదైన ఫేక్ కలెక్షన్లు చూపిస్తూ మన చిత్రం అంత వసూలు చేసింది ఇంత వసూలు చేసిందని చెబుతూ పక్కదారి పట్టిస్తారు.

ఇక తాజాగా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో వారీసు చిత్రం చేశారు. ఈ చిత్రం తమిళంలో పరవాలేదు అనిపించింది. తెలుగులో మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేదు. కానీ దిల్ రాజు గారు మాత్రం ఈ చిత్రం కేవలం 11 రోజుల్లోనే 250 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ విడుదల చేశారు. ఇది చాలా మందికి అనుమానాన్ని కలిగిస్తోంది.

వారిసూ చిత్రం సూపర్ హిట్ ఏమీ కాలేదు. జస్ట్ పర్వాలేదు అనిపించింది. కోలీవుడ్‌లోకూడా కేవలం హిట్టుగానే నిలిచింది. అందులోనూ వారీసుకు పోటీగా అజిత్ తునివు చిత్రం విడుదల అయింది. తునివు సినిమా ఎలా ఉన్నా స‌రే క‌లెక్ష‌న్ల‌లో మాత్రం కోలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద ఊచ‌కోత కోసింది. ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి.

అలాంటి స్థాయిలోవారీసు చిత్రం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తునీవుతో పోటీ ప‌డ‌లేక‌ పోయింది. మాస్ ఆడియ‌న్స్ అంద‌రు తునీవుకే ప‌ట్టం క‌ట్టారు. వారీసు చిత్రం ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కావ‌డం వ‌ల్ల ఆ స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌ లేక‌పోయింది.

ఇలాంటి త‌రుణంలో ఎలా పోటీపడినా కూడా వారీసుకు ఈ స్థాయి కలెక్షన్లు ఎలా సాధ్యం? బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కూడా ఈ రేంజి వసూలు రాలేదు అంటూ అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. కేవలం సూపర్ స్టార్ దళపతి మెప్పు కోసమే దిల్ రాజు ఇలా ఫేక్ కలెక్షన్లు ప్రచారం చేస్తూ అసత్యాలను సత్యాలుగా విజయ్‌ని త‌ప్పు దోవ పట్టిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఎంతైనా దిల్ రాజు మెంటాలిటి తెలిసిన వారు ఇందులో కూడా వాస్తవం ఉంది అని భావిస్తూ ఉండడం విశేషం.