Varun Tej | జూన్ 9న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం..!

Varun Tej | మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ తేజ్( Varun Tej ) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వ‌రుణ్ పెళ్లి వార్త‌ల‌పై స్ప‌ష్టత వ‌చ్చింది. ఆ యంగ్ హీరో.. న‌టి లావ‌ణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )ని పెళ్లాడ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ ప్ర‌తినిధి ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక జూన్ 9వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. […]

Varun Tej | జూన్ 9న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం..!

Varun Tej | మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. చిరంజీవి సోద‌రుడు నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్ తేజ్( Varun Tej ) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వ‌రుణ్ పెళ్లి వార్త‌ల‌పై స్ప‌ష్టత వ‌చ్చింది. ఆ యంగ్ హీరో.. న‌టి లావ‌ణ్య త్రిపాఠి ( Lavanya Tripathi )ని పెళ్లాడ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ ప్ర‌తినిధి ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు.

వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక జూన్ 9వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ట్లు పేర్కొన్నాడు. హైద‌రాబాద్‌లో జ‌రిగే ఈ వేడుక‌కు మెగా కుటుంబ స‌భ్యులు, కొంత మంది సినీ ప్ర‌ముఖులు మాత్ర‌మే హాజ‌రు కానున్నారు. ఇక పెళ్లి మాత్రం ఈ ఏడాది చివ‌ర్లో జ‌రిగే అవ‌కాశం ఉంది.

వ‌రుణ్‌, లావ‌ణ్య క‌లిసి మిస్ట‌ర్, అంత‌రిక్షం సినిమాల్లో న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లు స‌మాచారం. అప్ప‌ట్నుంచి ఈ ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లు షికారు చేశాయి.

ఇక వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటున్న‌ట్లు గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఆ వార్త‌లు నిజ‌మే అయ్యాయి. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్క‌టి కాబోతుండ‌టంతో వారి అభిమానులు, నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.