Mokshagna | మోక్షజ్ఞ జాతకం.. వేణు స్వామి ఇలా చెప్పాడేంటి? అయోమయంలో నందమూరి ఫ్యాన్స్
Mokshagna | నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడు, బాలయ్య తర్వాత అతని కొడుకు మోక్షజ్ఞ ఇప్పటి వరకూ వెండితెరకు పరిచయం కాకపోవడంపై నందమూరి అభిమానుల్లో చాలా నిరాశ ఉంది. అయితే అతని ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అని బాలయ్య చెబుతూ ఉండటం.. దాని మీద ఎలాంటి క్లారిటీ లేకపోవడం కూడా వాళ్లని మరింత నిరాశకు గురి చేస్తుంది. అయితే ఆమధ్య బాలయ్య సినిమా ‘ఆదిత్య 369’ ఓ ట్రెండ్ సృష్టించింది. అదే సినిమాను ‘ఆదిత్య 999’గా ఇప్పటి […]

Mokshagna |
నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడు, బాలయ్య తర్వాత అతని కొడుకు మోక్షజ్ఞ ఇప్పటి వరకూ వెండితెరకు పరిచయం కాకపోవడంపై నందమూరి అభిమానుల్లో చాలా నిరాశ ఉంది. అయితే అతని ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అని బాలయ్య చెబుతూ ఉండటం.. దాని మీద ఎలాంటి క్లారిటీ లేకపోవడం కూడా వాళ్లని మరింత నిరాశకు గురి చేస్తుంది.
అయితే ఆమధ్య బాలయ్య సినిమా ‘ఆదిత్య 369’ ఓ ట్రెండ్ సృష్టించింది. అదే సినిమాను ‘ఆదిత్య 999’గా ఇప్పటి కాలానికి అనుగుణంగా మార్చి మోక్షుని పరిచయం చేయాలని చూస్తున్నట్లుగా వార్తలైతే వినబడుతున్నాయి కానీ.. దీనిపై కూడా క్లారిటీ లేదు.
అయితే ఈమధ్య కాలంలో సెలబ్రెటీల జాతకాలను.. నోటి మీద ఉంచుకుని, చిన్న చితకా ఛానల్స్ లో కూడా అనర్గళంగా సినిమా వాళ్ళ జాతకాలను చెప్పేస్తున్న వేణు స్వామి అనే జాతక ఉద్ధండ పిండం.. నందమూరి వారసుడు మోక్షజ్ఞ జాతకాన్ని కూడా చెప్పేయడంతో అంతా నోరెళ్ళ బెడుతున్నారు. అతని మూవీ ఎంట్రీ గురించి తాజాగా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈమధ్య కాలంలో వేణు స్వామి చెప్పిన జోస్యం ఒకరిద్దరి విషయంలో నిజం కావడంతో.. బాగా ఫేమస్ అయిపోయాడు. అతను టాలీవుడ్ హీరోహీరోయిన్స్, సెలబ్రెటీల గురించి ఎవరు విడిపోయి విడాకులు తీసుకుంటారో.. ఏ హీరో చనిపోతారో అంటూ చెబుతుండటం.. అందులో కొన్ని నిజం కావడంతో చాలామంది వేణుస్వామి మాటలను నమ్ముతున్నారు.
ముఖ్యంగా సమంత, నాగచైతన్య విడాకుల విషయాన్ని ముందే చెప్పేయడంతో అది కాస్త నిజం కావడం వేణు స్వామి మాటలపై గురి కుదిరేలా చేసింది. ఇక ఈమధ్యనే పెళ్ళి చేసుకున్న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు కూడా విడాకులు తీసుకుంటారని.. త్వరలో ఓ హీరో, హీరోయిన్ చనిపోబోతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి.
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వేణుస్వామి మాటలకు మరింత హైప్ పెరిగింది. నందమూరి వారసుడు సినీ ఎంట్రీకి ఇంకా సమయం పడుతుందని, ‘అఖండ’ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యను కలిసినప్పుడే మోక్షజ్ఞ జాతకం గురించి సినీ కెరీర్ గురించి చెప్పానని తాజాగా వేణు స్వామి చెప్పుకొచ్చారు. అతని జాతకం అద్భుతంగా ఉంటుందని, అయితే సినీ ఎంట్రీకి ఇంకాస్త సమయం పట్టనుందని చెప్పాడట.
త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆయన చెప్పిన ఈ వార్త చేదు వార్తే. అయితే అతని జాతకం అద్భుతంగా ఉందని చెప్పినందుకు సంతోష పడాలో.. లేదంటే అతని ఎంట్రీ ఆలస్యం అవుతుందన్నందుకు బాధ పడాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు నందమూరి అభిమానులు.