ఎంపీగా పోటీ చేసి తీరుతా: వీహెచ్

ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు స్పష్టం చేశారు

  • By: Somu    latest    Feb 26, 2024 11:30 AM IST
ఎంపీగా పోటీ చేసి తీరుతా: వీహెచ్

విధాత : ఎంపీగా పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నానని ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తనను ఖమ్మం నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారని చెప్పారు. ఇండియాలో తనకంటే ఎక్కువ తిరిగే నాయకుడు ఉన్నారా అని, కాంగ్రెస్ పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించారు.


కొత్తగా వచ్చిన వాళ్లు టికెట్లు అడిగితే నాలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ తో పాటు నేనే ఎక్కువ తిరిగానని మిగతా నాయకులంతా నియోజకవర్గాలకే పరిమితమయ్యారన్నారు. నేను ఎంతో మంది నాయకులను తయారు చేశాననీ, గతంలో చిన్న వయసులో ఉన్నానని నాకు సీఎం పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు . రేవంత్ కు నేను సపోర్ట్ చేశాననీ, ఇకపై కూడా చేస్తానన్నారు. రేవంత్ పై నాకు నమ్మకం ఉందని నేనేం తప్పు చేశానని నన్ను పక్కన పెట్టారని ప్రశ్నించారు.


దేశంలో బీజేపీ మత రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. రాహుల్ గాంధీని గుళ్లకు రానివ్వని కేంద్రం తీరు అభ్యంతరకరమని, గుడులు వారి అయ్య జాగీర్లా అని ప్రశ్నించారు. మణిపూర్ బాధితులను పరామర్శించలేని ప్రధాని మోడీకి సముద్రంలో పలికి వెళ్లి పూజలు చేయడానికి మాత్రం సమయం ఉందని విమర్శించారు. రాముడిని తామే పుట్టించామన్న రీతిలో సెంటిమెంటు రెచ్చగొడుతున్నారని, దేవుడి పేరుపై ఓట్లు సంపాదించాలని బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.