Viral News | బ్యాచిలర్స్‌ ‘రూమ్‌’ కష్టాలు ఎవరికీ రావొద్దు..! బెంగళూరులో హౌసింగ్‌ సొసైటీ కండిషన్స్‌ వైరల్‌..!

Viral News | యువత లక్ష్యం ఉన్నత చదువులు.. ఆ తర్వాత మంచి ఉద్యోగం. ఇందు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఊరుకాని ఊరుకు వెళ్లి అక్కడ శ్రమిస్తూ ఉంటారు. కొందరు హాస్టళ్లలో ఉంటే.. మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి రూముల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. పెళ్లయిన వారికి త్వరగానే రూములు అద్దెకు దొరుకుతుంటాయి. కానీ, బ్యాచిలర్స్‌కు మాత్రం కష్టాలు తప్పవు. చాలాచోట్ల బ్యాచిలర్స్‌కు ఇండ్లు అద్దెకు ఇచ్చేందుకు చాలా మంది నిరాకరిస్తుంటారు. ముఖ్యంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో అద్దె దొరకడమనేది […]

Viral News | బ్యాచిలర్స్‌ ‘రూమ్‌’ కష్టాలు ఎవరికీ రావొద్దు..! బెంగళూరులో హౌసింగ్‌ సొసైటీ కండిషన్స్‌ వైరల్‌..!

Viral News | యువత లక్ష్యం ఉన్నత చదువులు.. ఆ తర్వాత మంచి ఉద్యోగం. ఇందు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఊరుకాని ఊరుకు వెళ్లి అక్కడ శ్రమిస్తూ ఉంటారు. కొందరు హాస్టళ్లలో ఉంటే.. మరికొందరు ఫ్రెండ్స్‌తో కలిసి రూముల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. పెళ్లయిన వారికి త్వరగానే రూములు అద్దెకు దొరుకుతుంటాయి. కానీ, బ్యాచిలర్స్‌కు మాత్రం కష్టాలు తప్పవు. చాలాచోట్ల బ్యాచిలర్స్‌కు ఇండ్లు అద్దెకు ఇచ్చేందుకు చాలా మంది నిరాకరిస్తుంటారు.

ముఖ్యంగా మెట్రోపాలిటన్‌ నగరాల్లో అద్దె దొరకడమనేది మరీ కష్టమైన విషయం. ఎక్కడైనా To-LET బోర్డు కనిపిస్తే వెళ్లి.. అడిగితే బ్యాచిలర్స్‌ అంటే అద్దెకు ఇవ్వమంటూ డోర్ వేస్తారు. కొందరు అద్దెకు ఇచ్చినా సవాలక్ష నిబంధనలు పెడుతుంటారు.

అయితే, తాజాగా బ్యాచిలర్స్ రూమ్ కండిషన్స్ పోస్ట్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరులో ఓ హౌసింగ్ సొసైటీ పెట్టిన బ్యాచిలర్స్‌కు పెట్టిన కండిషన్స్‌కు సంబంధించిన నెట్టింట వైరల్‌గా మరాగా.. అందులో ఉన్న నిబంధనలు చూసిన పలువురు బ్యాచిలర్స్‌ కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటున్నారు మరి.

అందులో పెట్టిన నిబంధనల్లో ‘ఇంటికి రాత్రి అతిథులు రాకూడదు. బాల్కనీలో ఫోన్లు మాట్లాడకూడదు. రాత్రిపూట వేరేవాళ్లు ఉండడానికి వీల్లేదు అంటే కొర్రీలు పెట్టారు. ఇంకా రాత్రి 10 తర్వాత రూమ్‌కి ఎవరూ రావొద్దు. ఒకవేళ ఎవరైనా అతిథులు మీ కోసం వచ్చినా రాత్రి 10 గంటలకు ముందుగానే వెళ్లిపోయాలి. ఒకవేళా రాత్రి ఎవరైనా ఉండేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలి, ఆ గెస్ట్‌ ఐడీ ప్రూఫ్‌ని కూడా అందజేయాలి. వారి వివరాలను నోట్ చేయాల్సి ఉంటుంది.

అలాగే రాత్రి తర్వాత కారిడార్, బాల్కనీలో ఫోన్లు మాట్లాడొద్దు. రాత్రిపూట పార్టీలు చేసుకోకూడదు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ మ్యూజిక్ పెట్టకూడదు’ అంటూ నిబంధనలు పెట్టారు. అంతేకాదండోయ్‌ అలాగే పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమించినా రూ.1000 జరిమానా విధించడం లేదంటే రూమ్‌ కూడా ఖాళీ చేయిస్తాయిస్తారట. ప్రస్తుతం ఈ నిబంధనలను చూసిన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బ్యాచిలర్స్‌ కష్టాలు ఎవరికీ రాకూడదంటున్నారు. మరికొందరు దారుణమని పేర్కొంటున్నారు.