Viral Video | రోడ్డుపై చొక్కా విప్పిన మంత్రి..! నిర్వాకంతో అంతా షాక్..!!
Viral Video | మంత్రి రోడ్డుపైనే చొక్కాను విప్పి.. వాటర్ బాటిల్‌ను కడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. మంత్రి నడిరోడ్డుపై ఇలా వాటర్ బాటిల్‌తో కడుక్కోవడం ఏంటీ అనుకుంటున్నారా? ఇందుకు ఓ కారణం ఉంది. ఈ విషయం తెలుసుకుంటే అందరూ షాక్‌కు గురవక తప్పదు..! వివరాల్లోకి వెళితే.. మంత్రి బజేంద్ర సింగ్ యాదవ్ వికాస్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ముంగవోలిలోని ఓ గ్రామం నుంచి యాత్ర […]

Viral Video | మంత్రి రోడ్డుపైనే చొక్కాను విప్పి.. వాటర్ బాటిల్‌ను కడుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. మంత్రి నడిరోడ్డుపై ఇలా వాటర్ బాటిల్‌తో కడుక్కోవడం ఏంటీ అనుకుంటున్నారా? ఇందుకు ఓ కారణం ఉంది. ఈ విషయం తెలుసుకుంటే అందరూ షాక్‌కు గురవక తప్పదు..! వివరాల్లోకి వెళితే.. మంత్రి బజేంద్ర సింగ్ యాదవ్ వికాస్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ముంగవోలిలోని ఓ గ్రామం నుంచి యాత్ర వెళ్తున్నది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరో మంత్రిపై దురద పౌడర్ చల్లాడు. దాంతో మంత్రి ఒక్కసారిగా దురదతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
దీంతో మంత్రి చొక్కా తీసేసి బాటిల్ నీళ్లతో బహిరంగంగా రోడ్డుపైనే కడుకున్నారు. ఈ సమయంలో కొందరు మంత్రి చొక్కా కడుతున్న సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామం నుంచి వెళ్తుండగా బీజేపీ వికాస్ రథ్ రోడ్డుపై ఇరుక్కుపోయింది. యాత్రకు నాయకత్వం వహిస్తున్న స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర వర్మ మాజీ సర్పంచ్, గ్రామ పెద్దల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్లు ఏమాత్రం సరిగా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికాస్ యాత్రను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గతవారం ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 25 వరకు కొనసాగనున్నది. రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
अशोकनगर, मध्य प्रदेश
जनसंपर्क पर निकले मंत्री को लगाया #खुजली पाउडर। यात्रा रोक, नहाना पड़ा।
PHE मंत्री / भाजपा नेता बृजेंद्र सिंह यादव को जनसंपर्क के दौरान किसी ने लगाया खुजली पाउडर।
खुजा खुजा कर हुआ था बुरा हाल ! pic.twitter.com/w5GZtCWmyy
— काश/if Kakvi (@KashifKakvi) February 9, 2023