టీమిండియా ఓట‌మిపై విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్

Virat Kohli | టీ 20 ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డిన భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన సంగ‌తి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొంది, ఫైన‌ల్‌కు చేరింది. ఈ ప‌రాజ‌యంపై భార‌త బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాడు. భావోద్వేగ ట్వీట్ చేశాడు. మా క‌ల‌ల‌ను సాకారం చేసుకోకుండానే, నిరాశ‌తో నిండిన హృద‌యాల‌ను ఆస్ట్రేలియా తీరాల‌ను వ‌దిలి వెళ్తున్నామ‌ని కోహ్లీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ ఒక […]

టీమిండియా ఓట‌మిపై విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్

Virat Kohli | టీ 20 ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డిన భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసిన సంగ‌తి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొంది, ఫైన‌ల్‌కు చేరింది. ఈ ప‌రాజ‌యంపై భార‌త బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించాడు. భావోద్వేగ ట్వీట్ చేశాడు.

మా క‌ల‌ల‌ను సాకారం చేసుకోకుండానే, నిరాశ‌తో నిండిన హృద‌యాల‌ను ఆస్ట్రేలియా తీరాల‌ను వ‌దిలి వెళ్తున్నామ‌ని కోహ్లీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కానీ ఒక జ‌ట్టుగా చాలా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన క్ష‌ణాల‌ను తీసుకెళ్తున్నామ‌ని తెలిపారు. ఇక నుంచి మ‌రింత మెరుగ‌వ్వాల‌నేదే తమ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. స్టేడియంలో త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చిన ప్ర‌తి అభిమానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ జెర్సీని ధ‌రించి భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం ఎల్ల‌ప్పుడూ గ‌ర్వంగా ఉంటుంద‌ని కోహ్లీ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు‌.. భార‌త్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్‌ 16 ఓవర్లలో ఒక్క‌ వికెట్ కూడా నష్టపోకుండా 170 పరుగులు చేసి ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. దీంతో పదిహేనేండ్ల క్రితం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన భార‌త జ‌ట్టు.. మరోమారు కప్పు సాధించాలని కోరుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. భారత్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పేలుతున్నాయి. అభిమానులు తమ బాధను ఇలా మీమ్స్‌ రూపంలో చూపిస్తున్నారు.